Posts filed under ‘vedas’
ఋగ్వేదం కథలు: వృత్రుడు
భారతీయ సంప్రదాయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ సంస్కృతిలో కథల ప్రాముఖ్యం తెలిసుండాలి: ఇక్కడ వాడుకలో ఉన్నన్ని కథలు మరెక్కడా ఉండవు. ప్రతి సందర్భానికీ ఒక కథ, ప్రతి వివరణకూ ఒక కథ….ప్రతి కారణానికీ ఒక కథ. కథలు మేధావి(నిజమైన మేధావులు సుమండీ) వర్గానికి మాత్రమే పరిమితమైన ఒక సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. ఇక్కడ కథలు చెప్పడం బోధనాపద్దతుల్లో ఒక ముఖ్యమైన పద్దతి. స్వామి వివేకానంద, శివాజీ, గాంధీ లాంటి వారి జీవితాలను చిన్నప్పుడు విన్న వారి కథలు ప్రభావితం చేసాయని మనం వింటుంటాం. Stories as moral exemplars అని ఇప్పుడు research కూడా జరుగుతోంది. ఆ వివరాలు ఇంకొకప్పుడు…
ఇప్పుడు వృత్రుడి విషయానికి వస్తే… వృత్రుడు జలాలను ఆవరించిన దానవుడు. “వృత్ర ఆవృణే” – ఆవరించడం వలన వృత్రుడు. అది జలాలను ఆవరించుకున్న మేఘం అయి ఉండవచ్చును. లేదా వృత్రుడనే రాక్షసుడై ఉండవచ్చును. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వృత్రుడుని జలాన్ని బంధించిన దానవుడనుకున్నా, మేఘం అనుకున్నా, మన మేతావులు ఇంకోటేదో అనుకున్న చెప్పదలచున్న అంశం మారదు. ఇది చారిత్రికమా, జరిగిందా, వృత్రుడనే రాక్షసుడి అవశేషాలు archeological survey లో బయటపడ్డాయా లేదా అన్న విషయం మీద కథ ఏదయితే చెప్పదలుచుకున్నదో అది ఆధారపడి ఉండదు.
ఋగ్వేదంలో ఇంద్రుడు వృత్రుడిని ఎలా సంహరించాడు అని ఉన్నది కానీ, వృత్రుని వివరాలు లేవు. భాగవతంలో ఈయనకి సంబంధించిన కథ ఒకటి ఉంది.
అసురమాత అయిన త్వష్టకు పుట్టినవాడు విశ్వరూపుడు. అతనికి మూడు తలలు.. ఒక నోటితో సోమం మరొక నోటితో మద్యం తాగుతుంటాడు. మూడవదానితో అన్నం తింటాడు (సోమం – దేవతలు, మద్యం – రాక్షసులు, అన్నం- మనుజులు) అతడు దేవతలకు ఆహుతులు ఇచ్చేవాడు. అలాగే తల్లి వంశం మీద ప్రేమతో దానవులకూ ఆహుతులిచ్చేవాడు. ఇంద్రుడు ఇది కనిపెట్టాడు. విశ్వరూపుడిని చంపేసాడు.
కన్నకొడుకుని చంపితే తల్లికి కోపం రాదా? త్వష్ట ఆగ్రహించింది. ఇంద్రుడిని సమ్హరించగలవాడి కోసం యజ్ఞం చేసింది, ఆ యజ్ఞం నుంచి ఒక భయంకరాకారుడు జన్మించాడు… అతనే వృత్రుడు. పాశ్చాత్యులు దీనిని ఇంకో విధంగా వక్రీకరించారు. వృత్రుడు ద్రవిడుడంట. ఇంద్రుడేమో ఆర్యుడు. వృత్రుడు గొప్ప రాజు, ఆయనకు అనేక దుర్గాలు ఉండేవి.. నదులకు ఆనకట్తలు కట్టాడు, ఆర్యులదేవుడు ఇంద్రుడు.. ద్రవిడులను సహించలేక వృత్రుడిని యుద్ధానికి పిలిచి ఆయన దుర్గాలనూ, ఆనకట్తలనూ కూల్చేసాడు, జలాన్ని విముక్తి చేసాడు! మనం బానిసలం కదా… పాశ్చాత్యులు చెప్పినది అక్షరాలా నిజం అని మన ప్రగాఢ నమ్మకం. ఆర్య దేవుడైన ఇంద్రుడికి Racial discrimination అన్నమాట యెహోవా లాగా.. యెహోవా కూడా అంతే, తనకు మద్యం సమర్పించని జనాన్ని యెహోవా కర్కశంగా వధిస్తాడు. పాశ్చాత్యులు అలాంటివే కాబోలు వైదిక దైవాలన్నీ అనుకున్నారు, బానిస కుక్కలకు చెప్పారు.. బానిస కుక్కలు అదే అంతిమవాక్కు అంటాయి ఇప్పటికి కూడా!
వృత్రుడి గూర్చి చెప్పబడిన సూక్తాల్లో కొన్నింటి తెలుగు అనువాదం ఇక్కడ: (దాశరధి రంగాచార గారి అనువాదం)
వృత్రుడు వృక్షం. వజ్రం గొడ్డలి. ఇంద్రుడు నరికాడు. చెట్టు కూలింది…
వృత్రుడు అహంకారి. తనతో తలపడువారు లేరనుకున్నాడు. ఇంద్రుడు వీరుడు. శత్రుంజయుడు. వృత్రుడినిపోరుకి పిలిచాడు. ఇంద్రుడి దెబ్బలు సహించలేకపోయాడు. కూలాడు. నదుల దరులను కూల్చాడు.
వృత్రుడు కూలాడు. నదుల దరులు కూలాయి!
వృత్రుని కాళ్ళు చేతులు పోయాయి. అయినా–నపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు, వృత్రుడు ఇంద్రుని మీదకు యుద్ధానికి ఉరికాడు. వృత్రుని రొమ్ము కొండ కొనవంటిది. ఇంద్రుడు వజ్రంతో వేటు వేశాడు. దెబ్బకు వృత్రుని అవయవాలు చెల్లాచెదురయ్యాయి. “వృత్రో అశయద్వనస్తః“
ఎంత అద్భుతం గా రాశారు కదా! “అయినా-నపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు” దీన్ని చదవగానే మన మేధావులు గుర్తొచ్చారెందుకో..
Recent Comments