Posts filed under ‘stories’

ఋగ్వేదం కథలు: వృత్రుడు

ఋగ్వేదం లోని మొదటి మండలం 32 వ సూక్తం లో వృత్రుడనే రాక్షసుని కథ ఉంటుంది. కథంటే మనం మన మీడియాలో చదివే స్త్రీజనోద్ధరణ/తాడిత పీడిత పెజల/కమ్యూనిస్టు బాపతు కథ కాదు. ఈ కథలు కృతకం గా ఉంటాయి. అటు సాహితీ విలువలుండవూ, ఇటు అవి చెప్పదలచుకున్న సమస్యలకూ పూర్తిగా న్యాయం చేకూర్చలేవు. ఇది పొయెట్రీ. భావ వ్యక్తీకరణ తీరూ, ఆ భాషా సౌందర్యం అనుభవిస్తేనే తెలిసేది.

భారతీయ సంప్రదాయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ సంస్కృతిలో కథల ప్రాముఖ్యం తెలిసుండాలి: ఇక్కడ వాడుకలో ఉన్నన్ని కథలు మరెక్కడా ఉండవు. ప్రతి సందర్భానికీ ఒక కథ, ప్రతి వివరణకూ ఒక కథ….ప్రతి కారణానికీ ఒక కథ. కథలు మేధావి(నిజమైన మేధావులు సుమండీ) వర్గానికి మాత్రమే పరిమితమైన ఒక సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. ఇక్కడ కథలు చెప్పడం బోధనాపద్దతుల్లో ఒక ముఖ్యమైన పద్దతి. స్వామి వివేకానంద, శివాజీ, గాంధీ లాంటి వారి జీవితాలను చిన్నప్పుడు విన్న వారి కథలు ప్రభావితం చేసాయని మనం వింటుంటాం. Stories as moral exemplars అని ఇప్పుడు research కూడా జరుగుతోంది. ఆ వివరాలు ఇంకొకప్పుడు…

ఇప్పుడు వృత్రుడి విషయానికి వస్తే… వృత్రుడు జలాలను ఆవరించిన దానవుడు. “వృత్ర ఆవృణే” – ఆవరించడం వలన వృత్రుడు. అది జలాలను ఆవరించుకున్న మేఘం అయి ఉండవచ్చును. లేదా వృత్రుడనే రాక్షసుడై ఉండవచ్చును. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వృత్రుడుని జలాన్ని బంధించిన దానవుడనుకున్నా, మేఘం అనుకున్నా, మన మేతావులు ఇంకోటేదో అనుకున్న చెప్పదలచున్న అంశం మారదు. ఇది చారిత్రికమా, జరిగిందా, వృత్రుడనే రాక్షసుడి అవశేషాలు archeological survey లో బయటపడ్డాయా లేదా అన్న విషయం మీద కథ ఏదయితే చెప్పదలుచుకున్నదో అది ఆధారపడి ఉండదు.

ఋగ్వేదంలో ఇంద్రుడు వృత్రుడిని ఎలా సంహరించాడు అని ఉన్నది కానీ, వృత్రుని వివరాలు లేవు. భాగవతంలో ఈయనకి సంబంధించిన కథ ఒకటి ఉంది.

అసురమాత అయిన త్వష్టకు పుట్టినవాడు విశ్వరూపుడు. అతనికి మూడు తలలు.. ఒక నోటితో సోమం మరొక నోటితో మద్యం తాగుతుంటాడు. మూడవదానితో అన్నం తింటాడు (సోమం – దేవతలు, మద్యం – రాక్షసులు, అన్నం- మనుజులు) అతడు దేవతలకు ఆహుతులు ఇచ్చేవాడు. అలాగే తల్లి వంశం మీద ప్రేమతో దానవులకూ ఆహుతులిచ్చేవాడు. ఇంద్రుడు ఇది కనిపెట్టాడు. విశ్వరూపుడిని చంపేసాడు.

కన్నకొడుకుని చంపితే తల్లికి కోపం రాదా? త్వష్ట ఆగ్రహించింది. ఇంద్రుడిని సమ్హరించగలవాడి కోసం యజ్ఞం చేసింది, ఆ యజ్ఞం నుంచి ఒక భయంకరాకారుడు జన్మించాడు… అతనే వృత్రుడు. పాశ్చాత్యులు దీనిని ఇంకో విధంగా వక్రీకరించారు. వృత్రుడు ద్రవిడుడంట. ఇంద్రుడేమో ఆర్యుడు. వృత్రుడు గొప్ప రాజు, ఆయనకు అనేక దుర్గాలు ఉండేవి.. నదులకు ఆనకట్తలు కట్టాడు, ఆర్యులదేవుడు ఇంద్రుడు.. ద్రవిడులను సహించలేక వృత్రుడిని యుద్ధానికి పిలిచి ఆయన దుర్గాలనూ, ఆనకట్తలనూ కూల్చేసాడు, జలాన్ని విముక్తి చేసాడు! మనం బానిసలం కదా… పాశ్చాత్యులు చెప్పినది అక్షరాలా నిజం అని మన ప్రగాఢ నమ్మకం. ఆర్య దేవుడైన ఇంద్రుడికి Racial discrimination అన్నమాట యెహోవా లాగా.. యెహోవా కూడా అంతే, తనకు మద్యం సమర్పించని జనాన్ని యెహోవా కర్కశంగా వధిస్తాడు. పాశ్చాత్యులు అలాంటివే కాబోలు వైదిక దైవాలన్నీ అనుకున్నారు, బానిస కుక్కలకు చెప్పారు.. బానిస కుక్కలు అదే అంతిమవాక్కు అంటాయి ఇప్పటికి కూడా!

వృత్రుడి గూర్చి చెప్పబడిన సూక్తాల్లో కొన్నింటి తెలుగు అనువాదం ఇక్కడ: (దాశరధి రంగాచార గారి అనువాదం)

వృత్రుడు వృక్షం. వజ్రం గొడ్డలి. ఇంద్రుడు నరికాడు. చెట్టు కూలింది

వృత్రుడు అహంకారి. తనతో తలపడువారు లేరనుకున్నాడు. ఇంద్రుడు వీరుడు. శత్రుంజయుడు. వృత్రుడినిపోరుకి పిలిచాడు. ఇంద్రుడి దెబ్బలు సహించలేకపోయాడు. కూలాడు. నదుల దరులను కూల్చాడు.

వృత్రుడు కూలాడు. నదుల దరులు కూలాయి!

వృత్రుని కాళ్ళు చేతులు పోయాయి. అయినానపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు, వృత్రుడు ఇంద్రుని మీదకు యుద్ధానికి ఉరికాడు. వృత్రుని రొమ్ము కొండ కొనవంటిది. ఇంద్రుడు వజ్రంతో వేటు వేశాడు. దెబ్బకు వృత్రుని అవయవాలు చెల్లాచెదురయ్యాయి. “వృత్రో అశయద్వనస్తః

ఎంత అద్భుతం గా రాశారు కదా! “అయినా-నపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు” దీన్ని చదవగానే మన మేధావులు గుర్తొచ్చారెందుకో..

December 25, 2008 at 2:42 pm 22 comments

అష్టావకృడు ఎవరు?

అనగనగా ఒక ఊళ్ళో ఓ నిరుపేద విద్యార్థి ఉండేవాడు(మామూలు గా బ్రాహ్మణుడుండేవాడు, కానీ ఇలా రాస్తే మన సంస్కర్తలు ఒప్పుకోరు. చరిత్ర తిరగేసి మరీ చీరేస్తారు!) సరే, కథలోకొద్దాం! మన పేద విద్యార్థిది తన కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని ఆర్థిక పరిస్థితి. కానీ గొప్ప పండితుడు. శాస్త్రాలన్నీ అవపోశన పట్టాలని కోరిక గలవాడు. దినమంతా కష్టపడి పని చేసి సంధ్యవేళ తన అర్ధాంగిని కూర్చోబెట్టుకుని, శాస్త్రాల్లోని మంత్రాలను వల్లెవేసి ఆమెకి వినిపించేవాడు.(ఇప్పట్లో లా టీవీ సీరియళ్ళు లేవు కాబట్టి, ఆమె కూడా శ్రధ్ధగా వినేది అనుకుందాం.)


ఒక సంధ్య వేళ ఎప్పటి లాగానే, తన భార్యకు ఈయన మంత్రాలు వల్లె వేయటం మొదలెట్టాడు తేడా ఏంటంటే ఆమె ఇప్పుడు ఒట్టి మనిషి కాదు. ఆ మoత్రాలను ఆమెతో పాటు గా గర్భస్థ శిశువు కూడా వింటున్నాడు! విన్నవాడు ఊరుకున్నడా ఊఁహు! ఊరుకుoటే మనం కథెందుకు చెప్పుకుంటాం? “మీరు పలికే మంత్రం మీద ధ్యాస ఉంచండి. మీ ఉఛ్ఛారణలో దోషం ఉంది.” అన్నాడు. పాపం ఇంకా ప్రపంచంలోనికి అడుగుపెట్టలేదు కద, ఆయనకి ఇక్కడ రూల్సు తెలియవు. ఇక్కడ *పెద్దవాళ్ళు* ఎంత పెద్ద తప్పు చేసినా, కారణాలు ఉన్నకుడా, సవినయంగా అయినా కూడా “మీది తప్పు” అని చెప్పకూడదు. చెబితే ఏంజరుగుతుంది? *పెద్దవాళ్ళు* విచక్షణ కోల్పోతారు. “నీకేం తెలుసురా, నిన్నగాక మొన్నొచ్చావ్, కుఱ్ఱకుంకవి” అని విసుక్కుంటారు, కొండొకచో శపిస్తారు. ఇక్కడా అదే జరిగింది. ఇంకా జన్మించని ఒక పసిగొడ్డు మాటలాడటమే విచిత్రం, అలాంటి మాటలు నన్నెందుకు విసిగిస్తున్నాయి అని ఒక్క క్షణమైనా అలోచించకుండా, ఉద్రేకంలో ఆ బిడ్డని శపించాడు. అసలే సత్యాన్వేషి, సుకర్మల ఫలితంగా మాటకు వచ్చిన శక్తి పని చేసింది. ఆ బిడ్డకి జన్మతః శరీరం మీద ఎనిమిది వంకర్లు వచ్చాయి. అందుకే ఆయన పేరు ఆష్టావకృడు.

ఇంక కథ కొంచెం సీరియస్. అష్ట వంకర్లతో పుట్టిన వారిని సమాజం మామూలుగా బ్రతకనిస్తుందా చెప్పండి? ఆడుగడుగునా హేళనలే, వైకల్యంతో పుట్టిన వారు సమాజంలో వినోదవస్తువులుగా చూడబడతారు(ఇప్పుడు మన మానవ హక్కుల సంఘాలు ఇంకో రకం గా హింసిస్తాయి, కడవలు కడవలు గా వారి మీద జాలి చూపించి, వారి వైకల్యాన్ని అనుక్షణం గుర్తుచేసి; ఇది ఇంకో విషయం!). అయినా ఆయన ఇవేమీ పట్టనట్లు ఉండేవాడు. ఎందుకంటే ఆయన సర్వం తెలిసిన జ్ఞాని. ఆయన ప్రపంచాన్ని చూసే చోటునుంచి వెక్కిరించే ఆకతాయిలకూ, ఆరాధించే శిష్యులకూ తేడా కనిపించదు కాబట్టి.

అత్యుత్తమమైన జ్ఞానాన్ని సరళమైన భాషలో, సూటిగా అందరికి చెప్పాలనే ఆయన జన్మించారు. అలా చెప్పటానికి రాజదర్బారు కంటే వేరొక మంచి చోటు ఉంటుందా?! అందుకని, ఓ మంచిరోజు చూసుకుని(ఏదో మాటవరసకి లెండి, మంచిరోజులు మనకి కావాలి గానీ, జ్ఞానులకెందుకు?)అప్పటి రాజు జనకుని ఆస్థానానికి బయలుదేరాడు. జనకుడంటే మన రాముడిగారి మామగారు కాదండోయ్, ఈయన ఇంకో జనకుడు.మన నాయకుడికి శరీరం సహకరించదు. అసలే ఎనిమిది వంకరలతో జన్మించాడు! జ్ఞానులకు అవేవో శక్తులుండవా ఎక్కడికనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి అన్న చెత్త సందేహం నాకూ వచ్చింది. అదే ప్రశ్న మా నాన్నమ్మ ని అడిగా, నన్నోసారి తేరిపార చూసి “ఎందుకుండాలి శక్తులు? అయినా మాయలూ మంత్రాలూ చేసేది ఐంద్రజాలికుడు రా నాయనా, జ్ఞానులు గాదు” అని సుతిమెత్తగా తిట్టింది. ఛీ! ఎదవ సదువు ఈమాత్రం జ్ఞానమూ లేదు అని తిట్టికున్నా!! ఎక్కడికో వెళ్ళిపోయాం. సరే, మళ్ళీ కథలోకి. మామూలుగా అందరికీ ఒకరోజు పట్టే ప్రయాణం మన కథనాయకుడికి ముప్పయి రోజులు పట్టింది. అర్థం చేసుకోదగిందే!!

చివరాఖరికి మన నాయకుడు జనకుని కొలువు చేరుకున్నాడు. నిండు సభ, రోజువారీ కార్యక్రమాల్తో అందరూ తెగ బిజీ గా ఉన్నారు. ఈయన రూపం, నడకతీరూ చూసి సభాసదులు నవ్వసాగారు. విచక్షణ లేశమైనా లేనివారు మొదలుపెడితే, వారిని చూసి కొందరు, అందురూ నవ్వుతున్నారని ఇంకొందరు.. ఎందుకు నవ్వుతున్నామో తెలియకుండా మరికొందరు. “ఎవడీ పిచ్చి వాడు?”, “వాడి శరీరంలో ఎన్ని వంకర్లో చూడు” “వంకర తిరిగిన ఆ పాదాల్ని చూడు”, “వాడి దుస్తుల్ని చూడు”. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. నిర్వేదంగా నిల్చున్నాడు అష్టావకృడు, అందరూ సద్దుమణిగేవరకూ నిశ్చలంగా ఉన్నాడు. వెంటనే ఒక్కసారిగా, గాఠ్ఠీగా నవ్వడం ప్రారంభించాడు. సభమొత్తం దద్దరిల్లిపోయేటట్టు. అవును మరి, శరీరంలోని వంకరలు చూసే అంతగా నవ్వితే, బుధ్ధిలో వంకరలు చూసి సర్వజ్ఞులకు ఇంకెంతగా నవ్వు రావాలి?

సహజంగానే నవ్విన వాళ్లంతా ఖంగు తిన్నారు! రాజు సహా!! “ఇంతమంది నిన్ను చూసి నవ్వుతున్నారు, సిగ్గుపడాల్సింది పోయి ప్రతిగా నువ్వెందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు జనకుడు. “నీ లాంటి గొప్ప విద్వాంసుడు, గొప్ప రాజూ ఇంతమంది చెప్పులుకుట్టేవాళ్లను చుట్టూ ఎందుకు ఉంచుకున్నాడా అని అలోచిస్తే నవ్వు వస్తోంది! నువ్వూ చెప్పులుకుట్టే వాడివే, రాజా” అన్నాడు. సభలో నిశ్శబ్దం! ఇంతెకుముందు రాజుతో ఎవ్వరూ అలా మాట్లాడలేదు! అష్టావకృడే కొనసాగిస్తూ “ఎందుకంటే, చెప్పులుకుట్టేవాడే చెర్మానికి విలువ కడతాడు. వాడికి అంతకంటే అలోచించే అవసరం ఉండదు, అలాగే మీరందరు నా చెర్మాన్నీ, ఆకారాన్నీ చూసి నేనటే ఎమిటో అంచనాకు వస్తున్నారు” అప్పుడు అర్థం అవుతుంది జనకుడికి, అష్టావకృడికి తను ఏమి మాట్లాడుతున్నాడో దాని గురించి బాగ తెలుసని! స్వతహాగ విద్వాంసుడు అయి ఉండతం చేత అష్టావకృడిని గుర్తించి, ఆయనతో సంవాదం మొదలు పెడతాడు జనకుడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పేరే, అష్టావక్ర గీత!


అష్టావక్ర గీత మన భగవద్గీత కంటే 5000 సంవత్సరాల పురాతనమైనది. చెప్పదలుచుకున్న విషయాన్ని, సూటిగా, శషభిషలు లేకుండా చెబుతాడు అష్టావక్ర. స్వామి నిత్యానంద చెప్పినట్లు, మనం కృష్ణుడి ని పూజిస్తాం, కానీ ఎవ్వరూ అష్టావకృడిని పూజించరు, కృష్ణుడిని పూజించినట్లుగా. కాబట్టి, వ్యక్తికంటే వారు చెప్పిన విషయాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, అష్టావకృడి విషయం లో.


November 17, 2008 at 8:55 pm 12 comments



Design a site like this with WordPress.com
Get started