Posts filed under ‘india’

Randy Komisar: పరాజయం నుంచి విజయాలు

స్టాంఫోర్డు వారి చానెల్ నుంచి క్రింది వీడియో ఎప్పుడైనా చూసారా?

చూసిన వారికి – మంచిది! ఈ పేజీ ఇంతటితో మూసేయండి.

చూడని వారికి: క్రింద చదవండి:

ర్యాండీ కోమిసర్(Randy Komisar) ఒక సిలికాన్ వ్యాలీ లో ఒక నూతన అధ్యాయానికి తెరతీసాడు. కంపెనీలకు CEO లు ఉండటం సాధారణమే గానీ, Virtual CEO లు అనే ఆలోచనకి ఆద్యుడు ర్యాండీ కోమిసర్ అనే చెప్పాలి. ఈ ర్యాండీ ని కార్నీజి మెల్లాన్ ర్యాండీ పాష్ అనుకునేరు, ఆయన ఇంకో గొప్ప వ్యక్తి!



ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ర్యాండీ కోమిసర్ స్టాన్ ఫోర్డు విశ్వవిద్యాలయంలో Consulting Professor of Entrepreneurship గా పని చేస్తారు. ఈయన బాగా జనాదరణ పొందిన The Monk and the Riddle అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనితో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డు బిజినెస్ రివ్యూ మార్చ్ 2000 ఎడిషనులో ” Goodbye career, Hello success” అనే వ్యాసాన్ని కూడా రాశారు. హార్వర్డు బిజినెస్ స్కూలు వారు ఈయన మీద ఒక ప్రత్యేకమైన case study ని కూడా చేస్తున్నారు ” Randy Komisar-The virtual CEO ” అని, బిజినెస్ రంగంలో ఇంతకన్న గొప్ప గుర్తింపు ఏముంటుంది! ఇంతకీ ఈ Virtual CEO గారు Virtual CEO కాకముందు తన అనుభవాలని నేను పైన పేర్కొన్న “Good Bye career….” లో వివరించారు. ఆసక్తి ఉన్నవారు చదవండి, చాలా ఉపయోగకరమైనది.

Virtual CEO గా ఈయన బాధ్యతలేమిటంటే – వివిధ కంపెనీల వ్యాపార సంబంధమైన అంశాలను సూత్రీకరించడం, లాభాలకొరకు పథకాలు రచించటం, పెట్టుబడిని సేకరించటం, వివిధ వ్యాపార సంబంధిత సంబంధాలను నెలకొల్పడం/వృద్ధి చేయటం, అభివృద్ధి కై ఉద్యోగ బృందాలదో కలిసి పనిచేయటం, యాజమాన్యానికి దిశానిర్దేశం ఇలాంటివన్నమాట! WebTV, TiVo, MondoMedia, Full Audio, Many Futures and the Wadhwani Foundation లాంటి అంతర్జాలాధారిత(Web 2.0) కంపెనీలు ఈయనని virtual CEO గా నియమించి మూసివేత దశలో ఉన్న వారి వ్యాపారాలను తిరిగి లాభాల బాటలోకి మరల్చుకున్నాయి. హార్వర్డు స్కూల్లో లా చదువుల నుంచీ, బి ఏ ఎకనామిక్స్ నుంచి, ఒకదానికొకటి పరస్పర సంబంధంలేని వివిధ ఉద్యోగాలనుంచీ ప్రస్తుతం అతనున్న స్థాయికి చేరుకున్న వైనం చాలా ఉత్తేజితం చేస్తుంది!

ఈ వీడియో చూడండి. నన్ను ఆకట్టుకున్న అంశం, ఆయన మాటల్లోనే – “నేను చాలా సార్లు చెప్పేమాట; సిలికాన్ వ్యాలీ ప్రత్యేకత దాని విజయాలది కాదు. పరాజయాలతో అది వర్తించే విధానం! Innovation is about taking risk to do things that haven’t been done before…… When I travel around and look at the Silicon Valleys of other places in the world, one of the distinguishing factors as you look at them is certainly not the infrastructure. They’ve got cubicles. They’ve got broadband. They’ve got lawyers. They’ve got accountants. You go to India and you walk into Wipro emphasis offices and you swear you’re in Silicon Valley. What generally is lacking is a culture of constructive failure. Constructive failure, the ability to tolerate failure, proceed with your career, and do it again.

………..I think you can learn from those failures. I think, ultimately, the only way to really, really, to get your money’s worth out of failure, better be your own, right? And that’s largely because that hollowness in your stomach, the disappointment of 250 people whose lives and families depend on you, the chagrin of your board members, you got to feel it. You got to feel it if you’re going learn it. And I think some people are lucky enough to go through life failing a little, or not at all. I don’t think they’re probably as wise as the guys who have actually failed.”

అనువదిస్తే అసలు మాటలకు న్యాయం చేయలేనేమో అని చేయలేదు (due to my own inefficiencies with both English and Telugu). క్లుప్తంగా చెప్పాలంటే, ర్యాండీ ఓడిపొమ్మంటాడు. ఓటమినుంచే గొప్ప గొప్ప విజయాలు సిద్ధిస్తాయంటాడు. ఓడిపోయినా తమాయించుకుని తిరిగి నిలబడి, ఓటమినుంచి నేర్చుకుని విజయం వైపు దూసుకెళ్ళమంటాడు. ఇదేమీ కొత్త విషయం కాదే, యండమూరినుంచీ రాబఋట్ కియోసకి వరకూ అందరూ చెప్పేదే, మనం అంతా ఎప్పుడూ వినేదే. నిజమే.. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏదో నాలుగు వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలు రాసి భుక్తి గడుపుకునే రచయిత కాదు. అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకుంటున్న ఒక విజయవంతమైన వ్యక్తి.

ఇది మనకెందుకు relevant? “Goodbye caraeer, Hello success”అని ఒకసారి సగటు భారతీయ విద్యార్థి మనస్సుతో ఆలోచించి చూడండి? గట్టిగా పెద్దలతో అని చూడండి? పెద్దలు తంతారు. వీడికి పిచ్చి గాని ఎక్కినట్లుంది సినిమాలు చూసి అని అంటారు. లేని అనుభవాన్ని resume లో చూపించయినా పర్వాలేదు ఒక కాపీ పేస్టు ఉద్యోగం సంపాయించటమే మన వాళ్ళ దృష్టిలో విజయం. మనదేశంలో ర్యాండీ పాష్ లూ, ర్యాండీ కోమిసర్ లూ, గూగుల్/మైక్రోసాఫ్ట్ ఇంకా ట్విట్టర్/ఫేస్ బుక్ లాంటి సంచలనాత్మక వ్యాపారాలను నెలకొల్పిన వారూ (ఈ వ్యాపారాలను university droupouts మొదలెట్టారు మీకు తెలుసా?) ఎందుకు లేరో ఆలోచించాల్సిన విషయం.

ఒకసారి మద్రాసుకెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక ఆటోని చూసాను దాని వెనక ” Failure is just a delay ” అని రాసి ఉంది. మన పెద్దలు ఇది తెలుసుకుని వెన్నుతడితే, ఎంతబాగుంటుందో కదా!



ఒక పెద్దాయనతో మాట్లాడుతుండగా మాటల్లో ఒక విషయం దొర్లింది – In US you will be awarded if you think like Bill Gates. In India, you will me penalized.

Related Links:

http://books.google.co.in/books?id=uYIGJWJGncYC&dq=The+Monk+and+the+Riddle:&printsec=frontcover&source=bn&hl=en&sa=X&oi=book_result&resnum=4&ct=result#PPR15,M1

http://etl.stanford.edu/handouts/0304_spr_speakerbio/RandyKomisar.htm

http://www.hbr.org/hbsp/hbr/articles/article.jsp?articleID=R00207&ml_action=get-article&print=true&ml_issueid=BR002

December 28, 2008 at 8:34 pm 11 comments

మేధావులని తరిమికొట్టండి!!

ఒక్కసారి క్రింది విషయం చదవండి:

i am really impressed by the indian agencies that after the attack they suddenly woke up and within 24 hrs they find a link till multan wowww.its wake up time for them .i am thinking if pakistan would have not be indian neigbour than where indians agencies can throw there incompetency. and they find a stupid boat aswell when i saw the picture really i cant control my laugh ,indians sea are so vulnerable that any one can sail throw them with ammo and weapons.what a security that one fine morning suddenly mumbie become a battle ground and army is fighting hard to take over,its 3 days and still they cannot overcome the wizerd type pakistani isi backed terrorist,really this is a slap on the indian army and law agencies, its just appears to me that like there third class copying of hoolywood filmz they tried to copy 9/11 but like there filmz they miserablly failed

.

ఇంకా ఇది:

lets see what’s been happening in the background of all this

1. Indian army’s involvemnt in Blasts in Malegaon and Sanjhota express and more at verge of getting revealed
2. the two highest ranking antiterrorism officers who were investigating the HOLY! COLONEL from Indian army also killed in Mumbai attacks
3. Pakistani army being sqeezed by american and Indian agents like Baitullah from the western front, why to leave the eastern theatre unattended,

but what will be the pretext!!!!!



చివరగా ఇది:

But . . . . . its looks like an huge propaganda against Pakistan.
These attcks could ba an join opration by Afghanistan, India & USA
just build more and more pressure on Pakistan.
What about those many many attcks in Pakistan
What about those many thousands, those lost their lives in these
attcks in Pakistan since Pakistan supportin againt WAR ON TERROR
Attacks in Mumbai and all European and others media are now busy to showing all



ఇవి చదివిన తర్వాత మీకెవరికైనా ఇవి ఎక్కడైనా విన్నట్లు అనిపిస్తోందా? నాకు అనిపించింది. కాని పాకిస్తానీ మీడియా నుంచి కాదు. ఇక్కడే. మనమధ్యే! ఇవే మాటలు కాకపోయినా ఇంచుమించు ఇవే భావాలు. ఇలా పాకిస్తాన్ పౌరులు మాట్లాడటం వింతగా అనిపించదు. పైపెచ్చుముచ్చటేస్తుంది. ఎంతయినా వారిదేశం. వారికీ దేశ భక్తి ఉంటుంది. ఇంచుమించు ఇలాంటి మాటలే మన మేధావులు మాట్లాడితే? ఇదంతాసహజమే, ఆటలో భాగమే, మనవాళ్ళుతక్కువతినలేదు అని తర్కిస్తే?

సరే…. ఉగ్రవాదం, మతం, రాజనీతి చాలా సంక్లిష్టమైన విషయాలు. మనం ఓకటని తేల్చి పడెయ్యలేం! మరి అలాంటప్పుడు “అంతా మాయ” అనే మెట్టవేదాంతం టైపులో “ఇక్కడెవ్వరూ పతివ్రతలు కారు. అంతా రిలేటివ్”, “మనకు లాభం ఉండే పనులు మనం చేస్తాం, అట్లే పాకిస్తానీయులకు లాభం ఉండే పనులు వాళ్ళు చేస్తారు” లాంటి వివరణలని ఎలా అర్థం చేసుకోవాలి?ఏరకమైన సమస్యని ఈ వివరణలు పరిష్కరిస్తాయి, ఏ రకమైన అంశాన్ని తెలియజెప్పడానికి ఉపయోగపడతాయి?? నాకైతే వినేవాళ్ళ తర్కాన్ని ఎద్దేవా చేసినట్లనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. ఈరకమైన వివరణలకంటే, నేను పైన ఉటంకించిన వివరణలే అర్థవంతం అనిపిస్తాయి. మేధావి రంగుపూసుకోని సాధారణ దేశప్రజలు చేసిన వ్యాఖ్యలవి . కనీసం వారికి పాకిస్తానుని కించపరిచి మాట్లాడి తమ “అభ్యుదయ” కుతి తీర్చుకోవాలని లేదు.

మన దేశపు మేధావులకు(లేదా మేధావులమని భ్రమపడుతున్న వారికి) సొంతంగా అలోచించే తెలివితేటలు ఎప్పుడువస్తాయో?!
Links: http://forumpakistan.com/mumbai-bomb-attacks-t18755-2.html

http://forumpakistan.com/mumbai-bomb-attacks-t18755.html

http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_08.html


December 10, 2008 at 5:24 pm 27 comments

వీళ్ళు హీరోలు కారు!

అతి సాధారణ స్థాయి నుంచీ అత్యున్నత స్థాయి వరకు ఒక స్పష్టమైన విధానం, రీతి ఏమాత్రమూ లేకుండా కుళ్ళిపోయిన ఒక వ్యవస్థ! సామాన్యమైన వ్యక్తి నుంచీ పాలించే ప్రభువుల వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి పరిధి లో బాధ్యతలువిస్మరించి ప్రవర్తించే వ్యవస్థ!! వ్యవస్థ ఉనికిని సవాలు చేసే సందర్భాలెదురైనప్పుడు, కొందరు వ్యక్తులు ఉద్యోగనిర్వహణలో ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది. A few handpicked men fight consequences they are not responsible for, solve problems which are not of their making, fight enemies they have never seen and eventually lose their lives. We call it sacrifice.

ఎందుకు చేస్తారు వాళ్ళీ త్యాగం? ఇంకో దారి ఉంటే వాళ్ళు కూడా ప్రాణం ఇంత తేలిగ్గా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు కదా. మనలాగే టీవీ ముందు కూర్చుని, ఒక పిజ్జా ని కోక్ తో అస్వాదిస్తూ ఎంచక్కా దేశ సమస్యలగురించీ, పోరాడేజవానులు చేసిన తప్పుల గురించీ మాట్లాడేవాళ్ళు. మాట్లాడటం సులభమే కదా. లేకుంటే కాపీ పేస్టు పని చేసి అలసిపోయి, ఇంటికి వచ్చి వార్తల్లో దృశ్యాలు చూసీ, బ్లాగుల్లో అభిప్రాయాలు చదివీ తెగ ఉత్తేజితం అయ్యి, “ హెలికాప్టర్నుంచి కిందికి దిగే సిత్రంమేము కొన్ని వందలసార్లు సూసినాం అని ఎద్దేవా చేసే వాళ్ళు. సరిగ్గా మనం ఉన్న స్థానంలోవాళ్ళూ ఉండటానికి ఇష్టపడేవాళ్ళు.

అసలా జవానులే లేకపోతే?? ఇలా అలోచించడానికి మనం ఇష్టపడం. (అలోచించటానికి మనముంటామా అసలు?)

అవును. విజయాల కోసం పరితపిస్తున్న దేశం ఇది. ఎవరో పోసిన మూసలో అలోచించీ అలోచించీ, విసిగి వేసారిన ప్రజలున్న దేశం. నిద్దరలేచినప్పటి నుంచీ అధః పాతాళానికేసి సాగుతున్న రాజకీయ శునకాల కథలు వినీ, చదివీ, మాట్లాడీ, చర్చించీ విసుగెత్తిన జనం ఉన్న దేశం. మహేంద్ర సింగు ధోని జుట్టు పొడవునీ, మల్లిక షెరావతు లో దుస్తులరంగులనీ గూర్చి చర్చించి, వార్తలు గా ప్రసారం చేసుకుని పబ్బం గడుపుకునే ప్రచార మాధ్యమాలున్న దేశం. అరువుతెచ్చుకున్న సిద్ధాంతాలతో రాజ్యమేలాలనే కుహన లౌకిక శునకాలూ, సిద్ధాంతాలకు ప్రతి సిద్ధాంతాలు చేసి ఉనికినికాపాడుకోవాలనే హిందూత్వ శునకాలూ విచ్చలవిడిగా తిరుగుతున్న దేశం. హేరోలెక్కడున్నారు??

జీవచ్ఛవాల్లా తిరుగుతున్న మనుషుల మీదకి ముష్కరులు దాడి చేసినప్పుడు, వీరోచితంగా పోరాడి, చచ్చిపోయిఇంకా మేం బ్రతికే ఉన్నాం అని ఋజువు చేసిన జవానులది విజయం కాక మరేంటి?

సమస్యల కారణాల వేపు దృష్టి సారించక, సంఘటనానంతర విషయాల్లో రంధ్రాన్వేషషణ చేసేంత గా జనం ప్రభావితులౌతున్నారంటేశేశేంద్రగారన్నట్లు … “దేశం లో తోక చుక్క పుట్టిందన్నమాటే“. Those who do not remember the past are condemned to repeat it. మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోమన్నది చరిత్ర. అదిగత చరిత్ర అయ్యేంతవరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ప్రాణాలు దూది పింజల్లా ఎగిరిపోతూనే ఉంటాయి.

సంఘ సంస్కర్తలకూ, మేధావులకూ చేతి నిండా పని!!

December 4, 2008 at 8:00 pm 17 comments

రాజకీయాలూ, సంస్కృతులూ!! – గుళ్ళెందుకు పడగొట్టాలి?

మీకూ నాకూ, మనలా సాధారణ జీవితాల్ని గడిపే చాలా మందికి మత దురభిమానం ఉండదు. సిద్ధాంతాలూ వాటి రాద్ధాంతాలనూ పట్టించుకునే తీరికెవ్వరికుంటుంది!

మనదేశం నుంచి తెల్లోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినా, వారి విధానాలూ; సమాజం అంటే ఎలా ఉండాలని పాశ్చాత్యులు అనుకుంటారో ఆ భావనలు ఇంకా మిగిలిఉన్నాయిక్కడ, సరిగా చెప్పలంటే, ఇంచుమించు గా అలాంటివే చెలామణి లో ఉన్నాయి. సమాజాలన్ని ఒక్కటే కదా, ఇంక పాశ్చాత్యులనుకునే సమాజం ఏంటి? తేడా చాలా ఉంది. మనమంతా నేర్చుకునే పద్దతి, ప్రపంచం పట్ల మన దృక్పథం మనం వివిధ రకాలు గా సంగ్రహించిన జ్ఞానం మీద ఆధారపడి ఉంతుంది(జన్మతః/జన్యుపర/విద్య ద్వారా నేర్చుకున్నది). అదే రకం గా మనది కాని వేరొక culture నుంచి వచ్చినవాళ్ళు మనల్ని కూడా అలాగే చూస్తారు. వారికి తెలిసిన భాషలో, వారికి అలవాటైన తరహాలోనే అలోచిస్తారు అలాగే, వ్యక్తపరుస్తారు. దేశమంటే ఒక జాతి/మత/భాష ల వల్ల సంఘటితమైన ప్రజలు నివసించే భూభాగం అనీ, ప్రజలందరికీ ఒక *మతం* ఉండాలనీ, మతానికి ఒక ప్రవక్త ఉంటాడనీ, దేవుడొక్కడే ఉంటాడనీ(వారి దేవుడే నిజమనీ) ఇలాంటివన్నమాట! ఇలాంటి పోకడలు ఏవీ కనిపించకుండా ఉన్నా ఒక దేశంలా, లేకపోతే చిన్న చిన్న రాజ్యాల సమూహంలా ఉన్న భారతావని నీ, చూసి మొదట నివ్వెరపోయి ఉంటారు బ్రిటీషు వారు, తర్వాత ఇక్కడ విశేషాలను తమ పరిధిలోనుంచి చూసి, వారికి అర్థం అయ్యే విధంగా, వారి సిధ్ధాంతాలతో పోల్చి సూత్రీకరించుకున్నారు!

ఇదంతా అప్రస్తుతం కాదు. ఇలామాట్లాడితే మన మేధావులు “ఇక్కడి ప్రతి సమస్య కీ బ్రిటిషర్లో, మొగలాయిలో కారణం అంటావేంటి” అని అంటారు, కొంచెం వ్యంగ్యం మేళవించి! భావాలను వ్యక్తపరుస్తున్న వ్యక్తి మీద ధ్యాస ఉన్నపుడు, భావం అర్థం కాదు. ఇక్కడ సమస్య బ్రిటీషువారు మనల్ని, ఇక్కడ ఆచార వ్యవహారల్నీ, సమాజ రీతుల్నీ గురించి వారికి నచ్చినట్లు చెప్పడం కాదు. సమస్య వారిచ్చిన వివరణలనీ, వారి అలోచనలను, వారు మనకోసం నిర్దేశించిన దారులనూ, మనవే అని మన మేధావులు కూడా నమ్మడం నమ్మి మనల్నేదో సంస్కరించాలని అనుకోవటం . బ్రిటిషువారు రాకముందు మనకు సమాజం లేదా ఏంటి? భిన్నజాతుల వారు కలిసి లేరా? ఒక శుభదినాన ఎవరో వచ్చి నువ్వూ, నీ సంస్కృతీ ఇది అని చెబితే గానీ మనకు అంతకుముందు అవగాహన లేదా?

మన నాయకులు ఎవరికైనా మంచి చేసే పద్దతి ఎంత విచిత్రం! ముస్లిములను ఆకర్షించాలంటే, “హిందూ భావజాలాన్ని” దెబ్బతీయాలి. “హిందువువలను” ఆకర్షించాలంటే(ఇది చాలా అరుదులెండి) మిగతా మతాలవాళ్ళని దాడి చెయ్యాలి. ఒక రాష్ట్రపోడు మీదికి ఇంకోడినీ, ఒక భాష మీదికి ఇంకోడినీ, ఒక కులపోడి మీద మరో కులపోడినీ, ఒక మాండలికం మాట్లాడే వాడి మీద మరోడినీ ఇలా రెచ్చగొడితేనే రాజకీయాలలో మనగలం అని కుళ్ళు సంస్కృతిని మన వాళ్ళు మన మహా నాయకులనుంచి అందిపుచ్చుకున్నారు. ఇవన్నీ మనమీద రుద్దిన బుర్రలేని నాయక కుక్కలన్ని ఇప్పుడు చచ్చి ఏ నరకంలోనో ఉంటాయి. మనం నేతలు మాత్రం వారి పేరు మీద అవార్డులు ప్రకటించేసుకుని, వారి భావజాలాలు పుణికిపుచ్చేస్కుని, ఎంచక్కా కుమ్ములాడుకుంటుంటారు!!

ఒక వర్గానికి నష్టం చెయ్యకుండా ఇంకో వర్గాన్ని ఆకట్టుకోలేమనే విషసంస్కృతిని మనం అంతా మనస్పూర్తిగా నమ్మినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకోసం మన మహానాయకులేర్పరిచిన వ్యవస్థ అలాంటిది. ఇది విస్మరించి జనం వీధులకెక్కి సత్యాగ్రహాలు చేస్తంటే నవ్వొస్తుంది!!

సమస్యను గుర్తించి, వివాదరహితంగా పరిష్కరించాలనుకునేవారికి కావాలి, నోటిసులు గట్రా! కాని అలా చేస్తే ఏమి సుఖం? ఇలాంటివన్నీ చిలికి చిలికి పెద్దవయితేనే కదా.. ఒట్లూ తర్వాత నొట్లూ!!

November 20, 2008 at 6:03 pm 5 comments



Design a site like this with WordPress.com
Get started