Posts filed under ‘fallacy’
మేధావి గారూ, ఎవడు లౌకికవాది??
మనం దేనిగురించి నేర్చుకోవాలన్న బళ్ళో చెప్పినట్లు దాని పుట్టుపూర్వోత్తరాలనుంచి రావాలి కదా! అందుకే ముందీ సెక్యులరిజం ఏంటి, ఎవరు దాన్ని మొదటిసారి ప్రయోగించారు లేదా ప్రతిపాదించారు అని చూస్తే..
George Jacob Holyoake అనే బ్రిటిష్ మహాశయుడు “సెక్యులరిజం” అనే పదాన్ని 1846 లో ప్రయోగించాడు. ప్రపంచం మొత్తం ఇంత వాడుకలో ఉన్న ఈ పదానికి సరైన అర్థం/నిర్వచనం ఏంటన్న విషయం మీద ఏకాభిప్రాయం మాత్రం లేదు. పదం యొక్క మూలాల్లోకి వెళితే, లాటిన్ “సెక్యులారిస్” నుంచి వచ్చిన పదానికి లాటిన్లో అర్థం, “ప్రాపంచికం” అని. (worldly rather than unworldly i.e opposite to religion). మన వికిపీడియా చెప్పేదాని Jacob Holyoake మాటల్లోనే: ప్రకారం సెక్యులరిజం అంటే, ప్రభుత్వ విధి విధానాలను ‘మతం’ నుంచి వేరు చేయడం. ప్రభుత్వ విధివిధానాల్లో చర్చి జోక్యాన్ని లేకుండా చెయ్యడం. అంతర్లీనంగా ఇందులో చర్చి (మతం) జోక్యం ఉండటం అనేది సార్వజనీనం అనే assumption కనిపిస్తుంది. “science as the true guide of man, morality as secular not religious in origin, reason the only authority, freedom of thought and speech and that owing to the uncertainty of survival we should direct our efforts to this life only”.
ఇప్పుడు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏమన్నారో చూద్దాం: “When India is said to be a secular state, it does not mean that we reject the reality of the unseen spirit or the relevance of religion to life or that we exalt irreligion. It does not mean that secularism itself becomes a positive religion or that State assumes divine prerogatives. We hold that not one religion should be given preferential status”. ఇప్పుడు అసలు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాశయుని మాటలూ, మన రాధాకృష్ణన్ మాటలూ పోల్చుకుని చూడండి. అసలు మతం యొక్క జోక్యమే లేదు అన్న వ్యతిరేకత నుంచీ, మతం వ్యతిరేకత కాదు, ఏమతానికీ ప్రత్యేక హోదా, గుర్తింపూ లేవు అనేంతగా రూపాంతరం చెందినది సిద్ధాంతం!
సెక్యులర్ రాజ్యం గురించి Donald E Smith తన India as a secular state అనే పుస్తకంలో సెక్యులర్ రాజ్యం గురించి ఇలా అంటాడు: “వ్యక్తిగత మరియు సామూహిక మత స్వేచ్ఛను ఇచ్చేదీ, మతముతో సంబంధము లేకుండా వ్యక్తిని పౌరుడిగా చూసేదీ, రాజ్యాంగపరంగా ఏమతానికి సంబంధములేనిది, ఏమతవిషయంలోను జోక్యం చేసుకోని రాజ్యం సెక్యులర్ రాజ్యము.”
ఇప్పుడు మన రాజ్యాంగం అవతారికను ఒకసారి గుర్తుచేసుకుందాం! (సవరించబడిన తర్వాత)
భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:
సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం;
ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;
హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;
వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము;
1950 లో గాని, లేక “లౌకిక” అనే పదాన్ని కలిపిన తర్వాత (1976) గానీ మన రాజ్యాంగంలో “సెక్యులర్” అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. అధికార మతం అన్నది ఏదీ లేకుండా, అన్ని మతాలనూ సమానంగా చూసేదీ, అన్ని మతాలనూ సమానంగా గౌరవించేదీ సెక్యులర్ రాజ్యము. ఇంగ్లాడులో రాణి ప్రొటెస్టెంటు చర్చి కి పెద్ద, అధికారి. కానీ ఇక్కడ చర్చిలాంటి ఒక వ్యవస్థ ఏదీ లేదు. కాబట్టి రాజ్యం అన్ని మతాలపట్లా తటస్థ వైఖరిని, నిస్పాక్షిక దృష్టినీ అవలంభించాలి.
ఇప్పుడు డా|| దుర్గాదాస్ బసు మరియు పి.యం.బక్షి లాంటి మహా న్యాయశాస్త్ర కోవిదులు లౌకికవాదం గురించి వారి పుస్తకాల్లో ఏమంటారో చూద్దాం:
- సమానత (ఆర్టికల్ 14)
- మత, కుల ప్రాతిపదికన పక్షపాత ధోరణి లేకుండుట (ఆర్టికల్ 15, 16)
- భావవ్యక్తికరణ స్వేచ్ఛ (ఆర్టికల్ 19, 21)
- అధికారమతం అన్నది ఏదీ ఉండకూడదు. రాజ్యము తనదైన మతాన్ని ఏర్పరచనూలేదు, ఉన్న మతాలలో దేనినయినా ప్రత్యేకంగా పరిగణించనూ కూడదు.
- మతాన్ని గానీ, మత వ్యవస్థను గానీ నిర్వహించడానికి రాజ్యము ఏ పౌరుడినుంచీ శిస్తు వసూలు చేయరాదు.
- రాజ్యం యొక్క ధనంతో నడిచే ఏ పాఠశాలలోనూ మతాన్ని మతబోధన నిషిధ్ధం.
- ప్రతి మత సమూహానికీ తమ ధార్మిక సంస్థలు ఏర్పరచుకునే హక్కూ, వాటి వ్యవహారాలను చూసుకునే హక్కూ ఉంటాయి(ధర్మాసనం 26)
- మైనారిటీ మతం వారికి వారి మతాన్నీ, సంస్కృతినీ పరిరక్షించుకునే హక్కు ఉంటుంది(ఆర్టికల్ 29)
అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ప్రాతిపదిక తీసుకుని నిర్ణయాలు చేస్తే, ఆ రాజ్యము తటస్థ రాజ్యం కాదు, తద్వారా అది లౌకికరాజ్యమూ కాదు.
ఇప్పుడు మన దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు ధర్మాసనం Ayodhya acquisition Act 1993 లో ఇదే సెక్యులర్ అంశం మీద ఏమంటుందో చూద్దాము!
1.దేశవిభజన నేపధ్యంలో లౌకికవాదం ఎనలేను ప్రాధాన్యతను సంతరించుకున్నది(అంటే మనది సెక్యులర్ రాజ్యం అయిఉంటే దేశవిభజన జరిగి ఉండేది కాదని అయ్యవారి భావము). దేశవిభజన జరిగిన తర్వాత కూడా, మొత్తం జనాభాలో 10 శాతం దాకా ఉండే ముస్లిములు భారతీయ పౌరులుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా అన్ని మతాలనూ సమానంగా చూసేటటునటి, ప్రతి పౌరుడుకీ సమాన హక్కులు కల్పించేట్టి ఒక లౌకిక, స్వేచ్చ ప్రసాదించే ఒక లౌకిక విధివిధానము అనివార్యము”(అయ్యవారి మాటలు విన్నారుగా? లౌకికవాద రాజ్యాంగము అంత ముఖ్యమైనదని మన మేధావులంతా అంగీకరించినప్పుడు 1947 లోని రాజ్యాంగపు అవతారికలో ఎందుకు “లౌకిక” భావాలను చేర్చలేదు? అప్పుడంతా ఈ మేధావులు ఏమయ్యరు? స్పష్టంగా చెప్పకపోయినా అది అంతలీనంగా ఉన్న భావన అని కొందరనవచ్చు, అంతర్లీనం గా ఉన్న భావనని కనీసం ఒక్కచోటయినా ఎందుకు నిర్వచించలేదు??)
2. ఇప్పుడు జె.అహ్మది గారు ఏమంటున్నారో విందాం: “సోషలిస్టు మరియు సెక్యులర్ అన్న పదాలను 42వ సవరణ ద్వారా చేర్చినప్పటికీ, సవరణకు ముందే సెక్యులర్ భావనలు మన రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్నాయి. సెక్యులర్ అన్న పదం సరిగ్గా ఇది అని నిర్వచించడానికి వీలులేనిది అవడం వల్ల, ఉద్దేశ్యపూర్వకం గా నిర్వచించకుండా వదిలివేయబడినది. 42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశ్యం అంతర్లీనంగా ఉన్న ఆ భావాన్ని స్పష్టంగా పేర్కొనడం” (అంటే సాక్షాత్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వారి మాటల్లోనే, సెక్యులర్ అనే పదము నిర్వచనాలకు అందనంత సంక్లిష్టమైనదన్నమాట. కొన్ని కోట్లమంది జీవితాలను శాసించే అతి శక్తివంతమైన ఒక సిద్ధాంతానికి, దేన్ని ఆధారంగా చేసుకుని రాజకీయనాయకులు శాసనాలు చేస్తారో, మేధావులు సిద్ధాంతాలు అల్లుతారో అదే పదానికి, అత్యంత పాప్యులర్ పదానికి మన రాజ్యాంగకర్తలకు సరి అయిన నిర్వచనం తెలియదు. అలాంటప్పుడు, ఈ పదం రాజ్యాంగంలో ఏమి చేస్తుంది? దీన్ని ఆధారంగా చేసుకుని శాసనాలు ఎందుకు చెయ్యాలి?)
3. “సెక్యులరిజం అంటే మెజారిటీ వ్యతిరేకత కాదు” – MN వెంకటాచలయ్య-సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జడ్జి
4. అసలు సెక్యులరిజానికి నిర్వచనమే లేదేంటా అని రభస జరుగుతుండటం వల్ల, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజాన్ని నిర్వచించడానికి ప్రయత్నం జరిగింది. MP Jain గారి Indian Constitutional Law నుంచి తీసుకోబడిన ఈ కోట్ చూడండి: “42వ సవరణ ద్వారా రాజ్యాంగ అవతారికలోకి “సెక్యులర్” మరియు “సోషలిస్ట్” అనే పదాలు చేర్చబడ్డాయి కానీ వీటి స్పష్టమైన నిర్వచనాలు దీనిలో చేర్చబడలేదు. CB45 ఈ పదాలకు నిర్వచనాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీని ప్రకారం “సెక్యులర్ రెపబ్లిక్” అనగా సర్వ మతాలకూ సమాన హోదా ఇచ్చే రెపబ్లిక్ అని నిర్వచించబడింది. కానీ ఈ నిర్వచన క్లాజు CA44 లో కనిపించలేదు. దీనికి కారణం: లోక్ సభలో అప్పటి జనతాపార్టీకి భారీ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో వారి సంఖ్య చాలా తక్కువ. CB45 ని లోక్ సభ పూర్తిగా ఆమోదించి పంపినా రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెసీయుల ఓటు వలన కొన్ని ఈ నిర్వచన క్లాజును తీసివేయాల్సి వచ్చింది.” (సూటిగా చెప్పాలంటే, సెక్యులరిజం అనే కీలకమైన పదం యొక్క నిర్వచనాన్ని రాజ్యాంగంలో పొందుపరచడానికి కాంగ్రెసు పూర్తిగా వ్యతిరేకం. ఎందుకని? ఏలినవారికే తెలియాలి!)
మనవాళ్లందరికీ దిగుమతి చేసుకున్న వస్తువులూ, సిద్ధాంతాలంటే విపరీతమైన మోజు. యోగి వేమన గానీ, ఈరో పెద్దయ్య గానీ ఫలానా అన్నారని చెప్పండి, “ఏందో మరీ చాదస్తుడిలా ఉన్నాడు” అనే ఒక నవ్వు పడేసి వెర్రోడి కిందికి జమ కట్టేయగలరు. అదే అబ్రహాం లింకనో, జాను మిల్టనో ఫలానా అన్నరని చెప్పండి, మీరు చెప్పేదాంట్లో సరుకేమీ లేకపోయినా మీరో మేధావి, అభ్యుదయవాది అన్నట్లు చూడబడతారు. కాబట్టి మనం సెక్యులరిజం గురించి ఎంత గొంతు చించుకుని మాట్లాడిన మన మేధావులకెక్కదు… అందుకే ప్రపంచవ్యాప్తం గా ఈ సెక్యులర్ కథా కమామిషూ ఏమిటో చూద్దాం!
అమెరికా: సెక్యులరిజం అనే పదం అసలు అమెరికా రాజ్యాంగంలో కనిపించదు. కానీ, ఇక్కడ చెప్పినట్లు గానే, అంతర్లీనంగా అమెరికా రాజ్యాంగంలో సెక్యులర్ భావాలు ఉన్నాయి. “రాజ్యాంగం సెక్షన్ 3 ప్రకారం: ప్రజాప్రతినిధులూ, సెనేటర్లూ, జుడిషియల్ అధికారులూ పదవీ స్వీకారమప్పుడు, రాజ్యాంగానికి బద్ధుడై చేసిన ప్రమాణమే వర్తిస్తుంది కానీ, మతపరమైన ఏ రకమైన ప్రమాణమూ, ఎలాంటి మతపరమైన అర్హతా వర్తించదు.” (Philadelphia convention, 1789)
ఇప్పుడు దీనిని మనదేశంలో అమలులో ఉన్న “సెక్యులరిజం” ను పోల్చుకుని చూడండి, మనదేశంలో అన్నింటికన్నా మనిషిలో మొట్టమొదట చూడబడేది మతం, కులం. మన గౌరవనీయ కలాం గారు ప్రెసిడెంటవ్వడానికి ఉన్న కారణాల్లో ఆయన ముస్లిం అవ్వడం ఒక కారణం. హిందూత్వ శునకాల ఓటు రాజకీయం అది. అమెరికాలో ఉన్న సెక్యులర్ రాజ్యాంగం ప్రకారం, రాజ్యం యొక్క ఖర్చులతో ఎటువంటి మతపరమైన విద్యాబోధన నిషిద్దం. కానీ మన ఆర్టికల్ 28(3) ప్రకారం, వ్యక్తి గానీ, లేక వ్యక్తి బాగోగులు చూసే వారి యొక్క అనుమతితో, ప్రభుత్వ వ్యయంతో నడిచే మతపరమైన విద్యాబోధనకు అనుమతి ఉంది. ఇది ఏ రకమైన సెక్యులరిజం??
ఇప్పుడు మన కలోనియల్ దొరలు ఇంగ్లాండు వారి గురించి మాట్లాడదాం.ఇంగ్లాండుకు రాతపూర్వకమైన రాజ్యాంగం లేదు. మైనారిటీలు సెక్యులర్ అన్న సమస్యలే లేవు. ఉన్నదంతా Racial Equality Commissions అనే విభాగం, జాతి/మత విభేదాలను పరిష్కరించటానికి. ఇక్కడ అన్ని మతాలకూ సమాన హోదా ఇవ్వబడుతుంది. మతపరమైన విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు.
జర్మన్లు మాత్రము వారి రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని నిర్వచించుకున్నారు. క్లుప్తం గా: ” ప్రభుత్వమూ మరియు మతమూ రెండు వేర్వేరు విషయాలు. మతాలతో సంబంధంలేకుండా రాజ్యం వ్యక్తులతో వర్తించాలి. ప్రతి పౌరుడికీ ఒకే రకమైన విధులు. మెజారిటీలకు గానీ, మైనారిటీలకు గానీ రిజర్వేషనులు లాంటివి నిషిద్ధం. ఇప్పుడు మళ్ళీ మనదేశపు లౌకిక వాదంతో దీనిని సరిపోల్చుకోండి? ఏది సెక్యులరిజం??
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే ఈ టపా నిడివి ఎక్కువ అవ్వడం వల్ల, చదివేవాళ్ళకు బోరుకొడుతుందేమో అని ఆపేస్తున్నా. చివరగా కొన్ని ప్రశ్నలు:
- రాధాకృష్ణన్ గారు అన్నట్లు: “ఏ మాతానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు” – మరి మన దేశంలో ముస్లిముల హజ్ యాత్రలకీ, క్రైస్తవులు చర్చులు నిర్మించుకోవడానికీ ప్రభుత్వం ఎందుకు ధనాన్ని వెచ్చిస్తున్నట్లు? ఇది పక్షపాతధోరణి కాదా?
- డోనాల్డ్ స్మిత్ గారి ప్రకారం: సెక్యులర్ రాజ్యాలు ఏదేని ఒక మతాన్ని గానీ, మత సంస్థ వ్యవహారాలలో గానీ జోక్యం చేసుకోకూడదు.అదే తర్కం ప్రకారం మరి భారత ప్రభుత్వం హిందువుల గుళ్ళనూ ఎందుకు నిర్వహించాలి? వాటి వ్యవహారాలు చూసేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు? ఇది మతపరమైన విషయాల్లో జోక్యం కాదా?
- ఆంధ్రప్రదేశ్ లో హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిం లకు భారీగా గ్రాంటులు ఇవ్వడం తరచూ వింటూంటాం. ఇది ముస్లిం ఓట్లను ఆకర్షించటానికి చేసే గిమ్మిక్కు అని మనకు అందరికీ తెలుసు. మరి ప్రభుత్వం మతాన్ని రాజకీయప్రయోజనాలకోసం వాడుకోవటంలేదా?ఇదేనా సెక్యులరిజం??
- ప్రకాశ్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాళిదళ్ శిరోమణీ గురుద్వారా కమిటీ ని తన గుప్పిట్లో ఉంచుకునేది. పంజాబ్లో గెలవాలంటే అలా చేయటం కీలకం కాబట్టి. మరి ఇది ప్రభుత్వ వ్యవహారోల్లోనికి మతాన్ని లాగటం కాదా? ఎక్కడుంది సెక్యులరిజం??
- ఒక్క కర్నాటకలోనే దేవాదాయ శాఖల ఆదాయం 50 కోట్లకు పైమాటే. అందులో పది శాతం మాత్రమే తిరిగి గుళ్ళ బాగోగులపైన ఖర్చుపెడతారు. అసలు దేవాదాయ శాఖలెందుకు? ఆ డబ్బుపై సెక్యులర్ ప్రభుత్వానికి ఏరకమైన అధికారం ఉంది? మరి మసీదులలోనూ, చర్చులలోనూ పోగయ్యే డబ్బు ఎక్కడికెల్తీంది? ఎవరు పక్షపాతి? ఎవరు సెక్యులర్?
మేధావిగారూ? ఎవడు సెక్యులర్?? కాస్త చెబుదురూ!!
References and further readings:
http://www.edwardjayne.com/secular/biblio.html
http://atheism.about.com/od/secularismseparation/a/HolyoakeSecular.htm
http://books.google.co.in/books?id=xNAI9F8IBOgC&pg=PA47&lpg=PA47&dq=Donald+E.+Smith+india+as+secular&source=web&ots=IDdfrBwIg4&sig=SKi1q3lBN3-agFnynE1aHDBgBQs&hl=en&sa=X&oi=book_result&resnum=8&ct=result#PPA46,M1
http://philosophy.lander.edu/logic/circular.html
http://www.probertencyclopaedia.com/cgi-bin/res.pl?keyword=Suppressio+Veri+Suggestio+Falsi&offset=0
http://www.allacademic.com/meta/p_mla_apa_research_citation/0/4/2/2/5/p42250_index.html
మేధావులని తరిమికొట్టండి!!
i am really impressed by the indian agencies that after the attack they suddenly woke up and within 24 hrs they find a link till multan wowww.its wake up time for them .i am thinking if pakistan would have not be indian neigbour than where indians agencies can throw there incompetency. and they find a stupid boat aswell when i saw the picture really i cant control my laugh ,indians sea are so vulnerable that any one can sail throw them with ammo and weapons.what a security that one fine morning suddenly mumbie become a battle ground and army is fighting hard to take over,its 3 days and still they cannot overcome the wizerd type pakistani isi backed terrorist,really this is a slap on the indian army and law agencies, its just appears to me that like there third class copying of hoolywood filmz they tried to copy 9/11 but like there filmz they miserablly failed
.
ఇంకా ఇది:
lets see what’s been happening in the background of all this
1. Indian army’s involvemnt in Blasts in Malegaon and Sanjhota express and more at verge of getting revealed
2. the two highest ranking antiterrorism officers who were investigating the HOLY! COLONEL from Indian army also killed in Mumbai attacks
3. Pakistani army being sqeezed by american and Indian agents like Baitullah from the western front, why to leave the eastern theatre unattended,
but what will be the pretext!!!!!
చివరగా ఇది:
But . . . . . its looks like an huge propaganda against Pakistan.
These attcks could ba an join opration by Afghanistan, India & USA
just build more and more pressure on Pakistan.
What about those many many attcks in Pakistan
What about those many thousands, those lost their lives in these
attcks in Pakistan since Pakistan supportin againt WAR ON TERROR
Attacks in Mumbai and all European and others media are now busy to showing all
ఇవి చదివిన తర్వాత మీకెవరికైనా ఇవి ఎక్కడైనా విన్నట్లు అనిపిస్తోందా? నాకు అనిపించింది. కాని పాకిస్తానీ మీడియా నుంచి కాదు. ఇక్కడే. మనమధ్యే! ఇవే మాటలు కాకపోయినా ఇంచుమించు ఇవే భావాలు. ఇలా పాకిస్తాన్ పౌరులు మాట్లాడటం వింతగా అనిపించదు. పైపెచ్చుముచ్చటేస్తుంది. ఎంతయినా వారిదేశం. వారికీ దేశ భక్తి ఉంటుంది. ఇంచుమించు ఇలాంటి మాటలే మన మేధావులు మాట్లాడితే? ఇదంతాసహజమే, ఆటలో భాగమే, మనవాళ్ళుతక్కువతినలేదు అని తర్కిస్తే?
సరే…. ఉగ్రవాదం, మతం, రాజనీతి చాలా సంక్లిష్టమైన విషయాలు. మనం ఓకటని తేల్చి పడెయ్యలేం! మరి అలాంటప్పుడు “అంతా మాయ” అనే మెట్టవేదాంతం టైపులో “ఇక్కడెవ్వరూ పతివ్రతలు కారు. అంతా రిలేటివ్”, “మనకు లాభం ఉండే పనులు మనం చేస్తాం, అట్లే పాకిస్తానీయులకు లాభం ఉండే పనులు వాళ్ళు చేస్తారు” లాంటి వివరణలని ఎలా అర్థం చేసుకోవాలి?ఏరకమైన సమస్యని ఈ వివరణలు పరిష్కరిస్తాయి, ఏ రకమైన అంశాన్ని తెలియజెప్పడానికి ఉపయోగపడతాయి?? నాకైతే వినేవాళ్ళ తర్కాన్ని ఎద్దేవా చేసినట్లనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. ఈరకమైన వివరణలకంటే, నేను పైన ఉటంకించిన వివరణలే అర్థవంతం అనిపిస్తాయి. మేధావి రంగుపూసుకోని సాధారణ దేశప్రజలు చేసిన వ్యాఖ్యలవి . కనీసం వారికి పాకిస్తానుని కించపరిచి మాట్లాడి తమ “అభ్యుదయ” కుతి తీర్చుకోవాలని లేదు.
మన దేశపు మేధావులకు(లేదా మేధావులమని భ్రమపడుతున్న వారికి) సొంతంగా అలోచించే తెలివితేటలు ఎప్పుడువస్తాయో?!
Links: http://forumpakistan.com/mumbai-bomb-attacks-t18755-2.html
http://forumpakistan.com/mumbai-bomb-attacks-t18755.html
http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_08.html
నమ్మకాలూ, అపనమ్మకాలు, భ్రమలు
పొగను చూస్తాం, నిప్పును వెదుకుతాం. చీకట్లో కర్ర ఉంటుంది, పామనుకుంటాం. నమ్మకాలూ, భ్రమలూ !
మనకున్న నమ్మకాలన్నీ భ్రమలా? కాదు. నమ్మకాల్లో కొన్ని నిజాలు, కొన్ని భ్రమలు. అన్నిటినించి ఈ *కొన్నిటిని* మనం ఎలా వేరు చేస్తాం? అవి నేర్పరు, బడిలో!
సంస్కృతం భాషా పండితులంతా జ్ఞాన సంపన్నులా? సంస్కృతం గాని, తెలుగు గాని భాషలే కదా! భాష నేర్చిన వాడు, భాషా పండితుడు, జ్ఞాని కాదు. (మేధావులు ఇప్పుడు సంస్కృత/తెలుగు పండితులు జ్ఞానులు కాలేరా అని నిలదియవచ్చు.. కావోచ్చండి! మన పండితులతో పాటు గా, అసలు అక్షరమే ఎరుగని రైతన్నలు కూడా జ్ఞానులవ వచ్చు, జ్ఞానులవడానికి సంస్కృతానికి సంబంధంలేదు.), మరి అలాగని మనం వీరిని అగౌరవ పరుస్తామ? లేదు. భాషా పండితులని వారి పాండిత్యానికి శిరసువంచి నమస్కరిద్దాం.
Microbiology గురించి యోగి వేమన నడిగితే ఏం చెబుతాడు? యోగి వేమన ని తత్త్వం అడగాలి. మనిషి మనస్తత్వం అడగాలి. Microbiology రాదని వేమన జ్ఞానాన్ని అవహేళన చేస్తామా?
మనకు తెలియని విషయాలు అలవాటు లేని ఆలోచనా రీతి విషయ సంగ్రహణ లో ఎంత నిర్భంద కారకాలో , మనకు తెలిసిన విషయాలు, అలవాటైన ఆలోచనతీరు అంటే నిర్భంద కారకాలు! అలవాటైన ఆలోచనలు కాబట్టి అవి నిజం అనడం అవివేకం.
commonsense గా చెలామణీ అయ్యే మనకు ఇష్టమైన, మనకు నచ్చే నమ్మకాలూ/అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకుని గంభీరమైన సమస్యలను అర్థం చేసుకోవాలని/చర్చించాలని చూస్తే, ఆలోచించే జనం తేరిపార చూస్తారు, వివరిస్తారు, విమర్శిస్తారు, చివరగా తిరగబడతారు!!
Recent Comments