Archive for December, 2008

Carpe Diem!

We, humans are intrigued by things that are new.

An adage goes “heard melodies are sweet, but those unheard are sweeter!”

The unseen brings hope, aspirations and a possibility of that ultimate human pursuit …. Happiness!

Hopes, by the way, never alter realities.

We have learned many such lessons in the past, and sure life has many in store for each of us.

For now, lets enjoy this moment while it lasts..

Carpe Diem! seize the day!!

Friends, I wish ya health, wealth and knowledge this new year!!

December 31, 2008 at 3:10 pm 8 comments

Randy Komisar: పరాజయం నుంచి విజయాలు

స్టాంఫోర్డు వారి చానెల్ నుంచి క్రింది వీడియో ఎప్పుడైనా చూసారా?

చూసిన వారికి – మంచిది! ఈ పేజీ ఇంతటితో మూసేయండి.

చూడని వారికి: క్రింద చదవండి:

ర్యాండీ కోమిసర్(Randy Komisar) ఒక సిలికాన్ వ్యాలీ లో ఒక నూతన అధ్యాయానికి తెరతీసాడు. కంపెనీలకు CEO లు ఉండటం సాధారణమే గానీ, Virtual CEO లు అనే ఆలోచనకి ఆద్యుడు ర్యాండీ కోమిసర్ అనే చెప్పాలి. ఈ ర్యాండీ ని కార్నీజి మెల్లాన్ ర్యాండీ పాష్ అనుకునేరు, ఆయన ఇంకో గొప్ప వ్యక్తి!



ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ర్యాండీ కోమిసర్ స్టాన్ ఫోర్డు విశ్వవిద్యాలయంలో Consulting Professor of Entrepreneurship గా పని చేస్తారు. ఈయన బాగా జనాదరణ పొందిన The Monk and the Riddle అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనితో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డు బిజినెస్ రివ్యూ మార్చ్ 2000 ఎడిషనులో ” Goodbye career, Hello success” అనే వ్యాసాన్ని కూడా రాశారు. హార్వర్డు బిజినెస్ స్కూలు వారు ఈయన మీద ఒక ప్రత్యేకమైన case study ని కూడా చేస్తున్నారు ” Randy Komisar-The virtual CEO ” అని, బిజినెస్ రంగంలో ఇంతకన్న గొప్ప గుర్తింపు ఏముంటుంది! ఇంతకీ ఈ Virtual CEO గారు Virtual CEO కాకముందు తన అనుభవాలని నేను పైన పేర్కొన్న “Good Bye career….” లో వివరించారు. ఆసక్తి ఉన్నవారు చదవండి, చాలా ఉపయోగకరమైనది.

Virtual CEO గా ఈయన బాధ్యతలేమిటంటే – వివిధ కంపెనీల వ్యాపార సంబంధమైన అంశాలను సూత్రీకరించడం, లాభాలకొరకు పథకాలు రచించటం, పెట్టుబడిని సేకరించటం, వివిధ వ్యాపార సంబంధిత సంబంధాలను నెలకొల్పడం/వృద్ధి చేయటం, అభివృద్ధి కై ఉద్యోగ బృందాలదో కలిసి పనిచేయటం, యాజమాన్యానికి దిశానిర్దేశం ఇలాంటివన్నమాట! WebTV, TiVo, MondoMedia, Full Audio, Many Futures and the Wadhwani Foundation లాంటి అంతర్జాలాధారిత(Web 2.0) కంపెనీలు ఈయనని virtual CEO గా నియమించి మూసివేత దశలో ఉన్న వారి వ్యాపారాలను తిరిగి లాభాల బాటలోకి మరల్చుకున్నాయి. హార్వర్డు స్కూల్లో లా చదువుల నుంచీ, బి ఏ ఎకనామిక్స్ నుంచి, ఒకదానికొకటి పరస్పర సంబంధంలేని వివిధ ఉద్యోగాలనుంచీ ప్రస్తుతం అతనున్న స్థాయికి చేరుకున్న వైనం చాలా ఉత్తేజితం చేస్తుంది!

ఈ వీడియో చూడండి. నన్ను ఆకట్టుకున్న అంశం, ఆయన మాటల్లోనే – “నేను చాలా సార్లు చెప్పేమాట; సిలికాన్ వ్యాలీ ప్రత్యేకత దాని విజయాలది కాదు. పరాజయాలతో అది వర్తించే విధానం! Innovation is about taking risk to do things that haven’t been done before…… When I travel around and look at the Silicon Valleys of other places in the world, one of the distinguishing factors as you look at them is certainly not the infrastructure. They’ve got cubicles. They’ve got broadband. They’ve got lawyers. They’ve got accountants. You go to India and you walk into Wipro emphasis offices and you swear you’re in Silicon Valley. What generally is lacking is a culture of constructive failure. Constructive failure, the ability to tolerate failure, proceed with your career, and do it again.

………..I think you can learn from those failures. I think, ultimately, the only way to really, really, to get your money’s worth out of failure, better be your own, right? And that’s largely because that hollowness in your stomach, the disappointment of 250 people whose lives and families depend on you, the chagrin of your board members, you got to feel it. You got to feel it if you’re going learn it. And I think some people are lucky enough to go through life failing a little, or not at all. I don’t think they’re probably as wise as the guys who have actually failed.”

అనువదిస్తే అసలు మాటలకు న్యాయం చేయలేనేమో అని చేయలేదు (due to my own inefficiencies with both English and Telugu). క్లుప్తంగా చెప్పాలంటే, ర్యాండీ ఓడిపొమ్మంటాడు. ఓటమినుంచే గొప్ప గొప్ప విజయాలు సిద్ధిస్తాయంటాడు. ఓడిపోయినా తమాయించుకుని తిరిగి నిలబడి, ఓటమినుంచి నేర్చుకుని విజయం వైపు దూసుకెళ్ళమంటాడు. ఇదేమీ కొత్త విషయం కాదే, యండమూరినుంచీ రాబఋట్ కియోసకి వరకూ అందరూ చెప్పేదే, మనం అంతా ఎప్పుడూ వినేదే. నిజమే.. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏదో నాలుగు వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలు రాసి భుక్తి గడుపుకునే రచయిత కాదు. అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకుంటున్న ఒక విజయవంతమైన వ్యక్తి.

ఇది మనకెందుకు relevant? “Goodbye caraeer, Hello success”అని ఒకసారి సగటు భారతీయ విద్యార్థి మనస్సుతో ఆలోచించి చూడండి? గట్టిగా పెద్దలతో అని చూడండి? పెద్దలు తంతారు. వీడికి పిచ్చి గాని ఎక్కినట్లుంది సినిమాలు చూసి అని అంటారు. లేని అనుభవాన్ని resume లో చూపించయినా పర్వాలేదు ఒక కాపీ పేస్టు ఉద్యోగం సంపాయించటమే మన వాళ్ళ దృష్టిలో విజయం. మనదేశంలో ర్యాండీ పాష్ లూ, ర్యాండీ కోమిసర్ లూ, గూగుల్/మైక్రోసాఫ్ట్ ఇంకా ట్విట్టర్/ఫేస్ బుక్ లాంటి సంచలనాత్మక వ్యాపారాలను నెలకొల్పిన వారూ (ఈ వ్యాపారాలను university droupouts మొదలెట్టారు మీకు తెలుసా?) ఎందుకు లేరో ఆలోచించాల్సిన విషయం.

ఒకసారి మద్రాసుకెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక ఆటోని చూసాను దాని వెనక ” Failure is just a delay ” అని రాసి ఉంది. మన పెద్దలు ఇది తెలుసుకుని వెన్నుతడితే, ఎంతబాగుంటుందో కదా!



ఒక పెద్దాయనతో మాట్లాడుతుండగా మాటల్లో ఒక విషయం దొర్లింది – In US you will be awarded if you think like Bill Gates. In India, you will me penalized.

Related Links:

http://books.google.co.in/books?id=uYIGJWJGncYC&dq=The+Monk+and+the+Riddle:&printsec=frontcover&source=bn&hl=en&sa=X&oi=book_result&resnum=4&ct=result#PPR15,M1

http://etl.stanford.edu/handouts/0304_spr_speakerbio/RandyKomisar.htm

http://www.hbr.org/hbsp/hbr/articles/article.jsp?articleID=R00207&ml_action=get-article&print=true&ml_issueid=BR002

December 28, 2008 at 8:34 pm 11 comments

కొన్ని పరస్పర సంబంధంలేని ఆలోచనలు…

ఈరోజు ఒక పెద్దాయన్ని కలిసి మట్లాడుతుంటే, మాటల్లో ఆయన తులసీ దాసు(?) మాటలను ఉదహరించారు. “కోకిల సకాలంలో కూయకుంటే కప్పల బెక బెకలు సంగీతం అవుతాయి నాయనా” అని. అవును మరి… ఎవరో ఒకరు ఖండించకపోతే కప్పల అరుపులు జ్ఞానం గా చెలామణీ అవుతాయి…(ఎవరు కోకిల ఎవరు కాదు, ఏది జ్ఞానం ఏది కాదు అని నిర్ణయించేదెవరనేది ఇంకో సంగతి. ఒక్కటి మాత్రం నిజం, కప్పల అరుపులు మధురం గా మాత్రం ఉండవు)

****
యు.జి.కృష్ణమూర్తి మాటలు…

…నాకు 21 సంవత్సరాల వయసొచ్చేటప్పటికి బలంగా కొన్ని అభిప్రాయాలేర్పడ్డాయి. బుద్ధుడూ,జీసస్, రామకృష్ణ పరమహంస మొదలగు వారంతా భ్రమలో జీవించారనీ, ఇతరులను భ్రమ పెట్టారనీ…ఉన్నదంతా ఇదేనా అని అనిపించేది. “వీరు దేనిగురించయితే మాట్లాడతారో, దేన్ని వివరిస్తారో ఆ స్థితి ఏది?వీళ్ళ వివరణలూ, విస్లేషణలూ బోధన లూ నాకు ఏమాత్రం సంబంధంలేనివి గా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ చెప్పడమే – ‘కోప్పడవద్దూ అని- నేనెప్పుడూ కోపం గానే ఉంటాను. లోపలంతా దుర్మర్గమైన ఆలోచనలే! కాబట్టి వీరు చెప్పేదంతా అబద్ధం. వీరు నాకు చెప్పేది నేను కాని వ్యక్తిగా నన్నుండమని… ఈ అబద్ధపు జీవితం నాకొద్దు. నేను దురాశాపరుడిని, వీరు ఆశల్లేని జీవితం గూర్చి మాట్లాడతారు. ఎక్కడో ఏదో తప్పుండి..వాళ్లు మాట్లాడే మాటలు అర్థం లేనివి! నన్ను నేను మార్చుకునేందుకు నేను సిద్ధం గా లేను. దురాశ, వ్యామోహాలు నా నిజాలు. ఆశల్లేని, వ్యామోహంలేని జీవితం గడపడానికోసం నాకు స్పష్టం గా తెలిసిన, నిజాలైన అత్యాశ, వ్యామోహాలను నేను వదులుకోలేను. ఆ రకం గా అబద్ధపు జీవితం గడపలేను” సరిగ్గా ఇవే మాటలు కాదు కానీ ఇలాంటి మాటలే మాట్లాడే వాడిని. సాంప్రదాయబధ్ధమైనది ఏదయినా, పవిత్రమన్నది ఏదయినా, ధిక్కరించే స్వభావం ఏర్పడింది. “శ్లోకాలూ, సాధనా, జపం ఏవీ వద్దు. నేను రాక్షస స్వభావిని పశు ప్రవృత్తి గలవాడిని.ఇదే నిజం! కోరికలను త్యజించడం, ఆశలు లేకుండుంటం, కోపం తెలియకుండాఉండటం అంతా ఒట్టి మాటలు. ఇవి తప్పు. తప్పే కాదు, నన్నివి నేను కాని మనిషిని చెయ్యలనుకుంటాయి, నన్ను తప్పుడు మార్గంలో నడిపిస్తాయి” అందుకే నాలో నేననుకున్నా “ఈ చెత్త మాటలు నాకిక వద్దు”. అంతే!

ఇదిలా ఉండగా ఒకరోజు ఎవరితోనో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నా.. నా భావాలన్నీ విని ఆయన నన్నో నాస్తికవాది కింద జమకట్టాడు. ప్రతి దాన్నీ విమర్శించడం, ప్రతి దాన్నీ ప్రశ్నించడం, ధిక్కరించడం ఇవన్నీ చూసి. మాటల మధ్యలో “తిరువన్నమలై లో రమణ మహర్షి అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నడు. ఆయనను నడిచే దైవం గా జనం భావిస్తారు. మనం ఆయనను వెళ్ళి కలుద్దామా ఒకసారి?” అన్నాడు.

నాకు ఈ సాధువులనీ, గురువులని దేవుని రూపాలని చెప్పుకుని తిరిగే వారెవ్వరినీ చూడటం ఇష్టంలేదు. ఒక్కరిని చూస్తే చాలదా? నేనెప్పుడూ ఎవరికోసమూ వెదకలేదు. ఎవరికాళ్ళ దగ్గరో కూర్చుని ఉపదేశాలూ తీసుకోలేదు “ఇది చెయ్యి, అది చెయ్యి… సాధన చేస్తూనే ఉండు.. ఒకనాడు లభిస్తుంది” లాంటివి నాకు సరిపోవు. నాకు దొరికినవి లెఖ్ఖలేనన్ని అనుభవాలు. ఆ అనుభవాలు శాశ్వతత్వాన్ని కోరుకుంటాయి. కానీ అలాంటి శాశ్వతత్వం ఎక్కడా లేదు. అందుకే నా దృష్టిలో ఈ సాధువులు, గురువులు అందరూ మోసగాళ్ళు. పుస్తకాల్లో ఉన్నదే వారి మాటల్లో వారు చెబుతారు. పుస్తకాలు నేను చదవలేనా? నాకు అనుభవాలొద్దు. అనుభవాల్లో ఏం తేడా ఉంది? లైంగిక అనుభవానికీ, వీరు చెప్పే ఈ ఆత్మానందానికి తేడా ఏముంది? అన్నీ అనుభవాలేగదా! బ్రహ్మం ఏమిటో అనుభవించాలనే కోరిక నాకు లేదు. మరొకరికెవరికైనా నిజం తెలుసుకోవడం, బ్రహ్మమును అనుభవించటం ఉపయోగకారి కావచ్చునేమో కానీ నాకు మాత్రం కాదు.

ఇలా ఇష్టం లేకుండానే వెళ్ళాను రమణ మహర్షిని చూడటానికి. ఆ వ్యక్తి లాక్కుని వెళ్తే వెళ్లాను. ఆయనక్కడ కూర్చుని ఉన్నాడు. చూడగానే నిపించిది “ఏమిటీ ఇతనా నాకు సహాయం చేయగలిగేది” అని. కూర్చుని కార్టూన్లు చదువుతాడు, కూరగాయలు తరుగుతాడు, దీనితోనో దానితోనో ఆడుకుంటున్నాడు, పిల్లాడి చేష్టలు చేస్తున్నాడు ఇతనా నాకు సహాయం చేసేది? ఇతనా గురువు? సరే ఇంత దూరం వచ్చాం కాబట్టి అక్కడ కూర్చున్నా – ఏమీ జరగలేదు. నేను ఆయన్ని చూసాను, ఆయనా నన్ను చూసాడు. “ఆయన సమక్షంలో నువ్వు ప్రశాంతతను అనుభవిస్తావు, ప్రశ్నలు ఉండవు, ఆయన చూపుతోనే న్నీ నశిస్తాయి” – ఇలాంటివి ఏమీ జరుగలేదు. అదంతా కథగానే ఉండిపోయింది. మదిలో చాలా ప్రశ్నలున్నాయి… రెండు గంటలనుంచీ అక్కడే కూర్చుని ఉన్నా, ఇంకా ప్రశ్నలున్నాయి. సరే ఈయన్ని కొన్ని ప్రశ్నలడుగుదాం అనిపించింది. ఆ సమయంలో నాకు మోక్షం నిజంగా కావాలని ఉండేది, అందుకే ప్రశ్నలు..

“నీవు ఏదయితే సంపాదించావో, ఏదయితే కనుగొన్నావో, దేన్నయితే అనుభవించావో… దాన్ని నాకివ్వగలవా?”

సమాధానం లేదు… కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ..

“నీవు ఏదయితే సంపాదించావో, ఏదయితే కనుగొన్నావో, దేన్నయితే అనుభవించావో… దాన్ని నాకివ్వగలవా?”

ఈ సారి సమాధానం వచ్చింది…

నేను ఇవ్వగలను… నువ్వు తీసుకోగలవా?” (I can give it to you. But, can you take it?)
“……………..”

*****

ఒక శ్రేయోభిలాషి సలహా…

“ఇంకో చిన్న సూచన. వెలుగు ను తెల్సుకుంటే మనం చీకటిని పారద్రోలగలము. వెలుగు వివరాలకోసం యత్నించండి. ప్రపంచం లోని చెడు గురుంచిన వివరాల పైన ఎక్కువ శ్రధ్ధ కనపరచకండి. బాధలో వున్న వాళ్ళకి ఆసరాగా మారండి. కాని, బాధితుల చేతి అస్త్రం గా ఎప్పటికీ మారద్దు. Just be careful.”

అదీ సంగతి!!

December 26, 2008 at 10:36 pm 4 comments

ఋగ్వేదం కథలు: వృత్రుడు

ఋగ్వేదం లోని మొదటి మండలం 32 వ సూక్తం లో వృత్రుడనే రాక్షసుని కథ ఉంటుంది. కథంటే మనం మన మీడియాలో చదివే స్త్రీజనోద్ధరణ/తాడిత పీడిత పెజల/కమ్యూనిస్టు బాపతు కథ కాదు. ఈ కథలు కృతకం గా ఉంటాయి. అటు సాహితీ విలువలుండవూ, ఇటు అవి చెప్పదలచుకున్న సమస్యలకూ పూర్తిగా న్యాయం చేకూర్చలేవు. ఇది పొయెట్రీ. భావ వ్యక్తీకరణ తీరూ, ఆ భాషా సౌందర్యం అనుభవిస్తేనే తెలిసేది.

భారతీయ సంప్రదాయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ సంస్కృతిలో కథల ప్రాముఖ్యం తెలిసుండాలి: ఇక్కడ వాడుకలో ఉన్నన్ని కథలు మరెక్కడా ఉండవు. ప్రతి సందర్భానికీ ఒక కథ, ప్రతి వివరణకూ ఒక కథ….ప్రతి కారణానికీ ఒక కథ. కథలు మేధావి(నిజమైన మేధావులు సుమండీ) వర్గానికి మాత్రమే పరిమితమైన ఒక సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. ఇక్కడ కథలు చెప్పడం బోధనాపద్దతుల్లో ఒక ముఖ్యమైన పద్దతి. స్వామి వివేకానంద, శివాజీ, గాంధీ లాంటి వారి జీవితాలను చిన్నప్పుడు విన్న వారి కథలు ప్రభావితం చేసాయని మనం వింటుంటాం. Stories as moral exemplars అని ఇప్పుడు research కూడా జరుగుతోంది. ఆ వివరాలు ఇంకొకప్పుడు…

ఇప్పుడు వృత్రుడి విషయానికి వస్తే… వృత్రుడు జలాలను ఆవరించిన దానవుడు. “వృత్ర ఆవృణే” – ఆవరించడం వలన వృత్రుడు. అది జలాలను ఆవరించుకున్న మేఘం అయి ఉండవచ్చును. లేదా వృత్రుడనే రాక్షసుడై ఉండవచ్చును. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వృత్రుడుని జలాన్ని బంధించిన దానవుడనుకున్నా, మేఘం అనుకున్నా, మన మేతావులు ఇంకోటేదో అనుకున్న చెప్పదలచున్న అంశం మారదు. ఇది చారిత్రికమా, జరిగిందా, వృత్రుడనే రాక్షసుడి అవశేషాలు archeological survey లో బయటపడ్డాయా లేదా అన్న విషయం మీద కథ ఏదయితే చెప్పదలుచుకున్నదో అది ఆధారపడి ఉండదు.

ఋగ్వేదంలో ఇంద్రుడు వృత్రుడిని ఎలా సంహరించాడు అని ఉన్నది కానీ, వృత్రుని వివరాలు లేవు. భాగవతంలో ఈయనకి సంబంధించిన కథ ఒకటి ఉంది.

అసురమాత అయిన త్వష్టకు పుట్టినవాడు విశ్వరూపుడు. అతనికి మూడు తలలు.. ఒక నోటితో సోమం మరొక నోటితో మద్యం తాగుతుంటాడు. మూడవదానితో అన్నం తింటాడు (సోమం – దేవతలు, మద్యం – రాక్షసులు, అన్నం- మనుజులు) అతడు దేవతలకు ఆహుతులు ఇచ్చేవాడు. అలాగే తల్లి వంశం మీద ప్రేమతో దానవులకూ ఆహుతులిచ్చేవాడు. ఇంద్రుడు ఇది కనిపెట్టాడు. విశ్వరూపుడిని చంపేసాడు.

కన్నకొడుకుని చంపితే తల్లికి కోపం రాదా? త్వష్ట ఆగ్రహించింది. ఇంద్రుడిని సమ్హరించగలవాడి కోసం యజ్ఞం చేసింది, ఆ యజ్ఞం నుంచి ఒక భయంకరాకారుడు జన్మించాడు… అతనే వృత్రుడు. పాశ్చాత్యులు దీనిని ఇంకో విధంగా వక్రీకరించారు. వృత్రుడు ద్రవిడుడంట. ఇంద్రుడేమో ఆర్యుడు. వృత్రుడు గొప్ప రాజు, ఆయనకు అనేక దుర్గాలు ఉండేవి.. నదులకు ఆనకట్తలు కట్టాడు, ఆర్యులదేవుడు ఇంద్రుడు.. ద్రవిడులను సహించలేక వృత్రుడిని యుద్ధానికి పిలిచి ఆయన దుర్గాలనూ, ఆనకట్తలనూ కూల్చేసాడు, జలాన్ని విముక్తి చేసాడు! మనం బానిసలం కదా… పాశ్చాత్యులు చెప్పినది అక్షరాలా నిజం అని మన ప్రగాఢ నమ్మకం. ఆర్య దేవుడైన ఇంద్రుడికి Racial discrimination అన్నమాట యెహోవా లాగా.. యెహోవా కూడా అంతే, తనకు మద్యం సమర్పించని జనాన్ని యెహోవా కర్కశంగా వధిస్తాడు. పాశ్చాత్యులు అలాంటివే కాబోలు వైదిక దైవాలన్నీ అనుకున్నారు, బానిస కుక్కలకు చెప్పారు.. బానిస కుక్కలు అదే అంతిమవాక్కు అంటాయి ఇప్పటికి కూడా!

వృత్రుడి గూర్చి చెప్పబడిన సూక్తాల్లో కొన్నింటి తెలుగు అనువాదం ఇక్కడ: (దాశరధి రంగాచార గారి అనువాదం)

వృత్రుడు వృక్షం. వజ్రం గొడ్డలి. ఇంద్రుడు నరికాడు. చెట్టు కూలింది

వృత్రుడు అహంకారి. తనతో తలపడువారు లేరనుకున్నాడు. ఇంద్రుడు వీరుడు. శత్రుంజయుడు. వృత్రుడినిపోరుకి పిలిచాడు. ఇంద్రుడి దెబ్బలు సహించలేకపోయాడు. కూలాడు. నదుల దరులను కూల్చాడు.

వృత్రుడు కూలాడు. నదుల దరులు కూలాయి!

వృత్రుని కాళ్ళు చేతులు పోయాయి. అయినానపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు, వృత్రుడు ఇంద్రుని మీదకు యుద్ధానికి ఉరికాడు. వృత్రుని రొమ్ము కొండ కొనవంటిది. ఇంద్రుడు వజ్రంతో వేటు వేశాడు. దెబ్బకు వృత్రుని అవయవాలు చెల్లాచెదురయ్యాయి. “వృత్రో అశయద్వనస్తః

ఎంత అద్భుతం గా రాశారు కదా! “అయినా-నపుంసకుడు మగతనంకోసం వెంపర్లాడినట్లు” దీన్ని చదవగానే మన మేధావులు గుర్తొచ్చారెందుకో..

December 25, 2008 at 2:42 pm 22 comments

ఇంట్లో ఆడాళ్ళ కొప్పులకీ ఊరవతల చింతచెట్టుమీద దెయ్యానికీ….

…..ఏటి సంబంధం అని విస్తుపోతున్నారా? మూర్ఖులారా….యినుకోండి

ఆర్యా! … క్షమించాలి ద్రవిడా!!

మనింట్లో ఆడోళ్ళ కొప్పులకీ ఊరవతల చింతచెట్టు మీది దెయ్యానికీ అసలు లంకే లేదనే ది అగ్ర వర్ణాలు తరతరాలు గాచేస్తున్న కుట్ర. మీకు తెలుసా? ఆడోళ్ళ కొప్పులూ are directly proportional to దెయ్యాల తిప్పలు. విషయంబయటపడితే ఎక్కడ పురుషాఅధిపత్యానికి అఘాతం తగులుతుందో అని అగ్రవర్ణ జనమంతా వారి ఆడోళ్ళను మాత్రంకొప్పులు కట్టుకోవద్దని చెప్పి, తాడిత పీడిత వర్ణాలకూ దళితులకూ తీరని అన్యాయం చేసారు.

ఉదాహరణ కు అరుంధతమ్మ వ్యాసం తీసుకుందాం. శతాబ్దాల తరబడి కప్పబడి ఉన్న దారుణమైన నిజాన్ని, ఇలాంటినిజాల్ని ఎన్నో సిస్టర్ అరుంధతమ్మ బయటకు తెచ్చింది. ఆమె వ్యాసాల సైధ్ధాంతిక నేపధ్యం ఉగ్రవాద దాడులే అయినాతన పరిధి, తాడిత పీడిత వర్గాలకు దెయ్యాలగురించిన జ్ఞానంలేకపోవడం వల్ల సోమాలియా లో దళితపెజలుబ్రాహ్మణులచేతిలో ఎంత నష్టపోయారో కూలంకషంగా వివరించింది. అర్థం కాలేదా? అందుకే మీ బతుకులిట్టా ఏడిసింది.

అసలు అరంధతమ్మ ఏం రాస్తదో, మంచె మైలయ్య ఏమన్నడో తెలియాలంటే మీ చాందస భావజాలాల నుంచి ముందుబయటబడాలె. ఎప్పుడో మైలయ్య కాపీలు గొట్టినాడని, ఆయన జేసిన డాక్టరేటు గాదంటరా, రాసిననేహిందువునెట్లయితతప్పంటరా? మీరు తప్పన్నా దానికికుండే ఆడియన్సు దానికుంటరు. It has its own meaning and its own value. You are only trying to misguide by juxtaposing kanche Ilayya and bheeshma.

ఇప్పుడూ, ఇంతకూ అసలు విషయం అరుంధతమ్మ గదూ, తాడిత పీడిత జనోద్ధరణ చెయ్యాలని ఆవేదన కల్గిన సిస్టర్అరుంధతీ రాయమ్మ సరిగ్గా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడే ఎందుకు మేల్కొందబ్బా? అనగా అగ్రకుల హిందువులంతాఒక్కసారిగా నిద్రలేచి, తాడిత పీడిత దళిత వర్గ పెజలను గుళ్ళోకి రావద్దని ఉక్కుపాదాల్తో అణిచేసి, ఫళాన ఇస్లాముఉగ్రవాదులకు కోపం తెప్పించి(చూశారా మన తాడిత పీడిత వర్గాలంటే పాకిస్తాను అన్నలకు ఎంత పేమ!!) దాడులకుఉసిగొల్పిందని అర్థం.. అవునా? గ్లోబల్ విలేజి అని చంకలు గుద్దుకుని అమెరికా గురించి రాస్తారా.. ఎంత ధైర్యం? గ్లోబల్విలేజి అంటే ఇది నాయనా.. బ్రాహ్మణులు మన రెవరెండు పింటోలకు పెసాదం పెట్టకుండా అణిచేస్తే, దావూద్ ఇబ్రహీముఅన్నకు కోపం వచ్చింది. ఏంది రా మా పింటో తమ్మునికి పెసాదం పెట్టవా అని జెప్పి లష్కర్ తమ్ముళ్ళను కొంతమందినిపోగేసి, ఎల్లి మన పెతాపం బ్రిటీషోళ్ళమీద, యూదు రాబ్బై మీదా సూపీండని కూసిన్ని గ్రనేడ్లు ఇచ్చి సాగనంపినాడు. ఇందుమూలము ఏం తెలుస్తోంది? అగ్రకుల ఆధిపత్యమే వీటన్నిటికీ మూలకారణం. ఆమాట చెప్పిందని మా అరుంధతిసిస్టరును రచ్చకీడుస్తారా? దెయ్యాలకీ కొప్పులకూ ఉన్న అనులోమానుపాతాన్ని ఆనాడే తాడిత పీడిత పెజలు సెప్పిఉంటేఇప్పుడు ఉగ్రవాదుల దాడి జరిగేదా? మైలయ్య పుస్తకాలు రాసేవోడా? ఆలోచించండి.
http://blog.vikatakavi.net/2008/12/16/మేధావులు-బాబోయ్-మేధావులు/

December 18, 2008 at 9:31 pm 12 comments

నావైపుకు ఆకర్షింపబడ్డ సరికొత్త వ్యక్తివి నువ్వేనా?

నావైపుకు ఆకర్షింపబడ్డ సరికొత్త వ్యక్తివి నువ్వేనా?

ముందుగా నీకో హెచ్చరిక….నీ ఊహల్లో నన్ను ఎలా చూస్తున్నావో నేను అది మాత్రం కాదు

నీ ఆదర్శాన్ని నాలో వెదకాలనుకుంటున్నావా?

నన్ను నీ వాడిని చేసుకోవడం సులభతరం అనుకుంటున్నావా?

నా స్నేహం లో నిష్కల్మషమైన సంతృప్తిని పొందాలనుకుంటున్నావా?

నేను నిజాయితీపరుడననీ, నమ్మదగినవాడననీ అనుకుంటున్నావా?

నా సున్నిత వర్తన, ఓపికల వెనుక ఏముందోనని నీకు అనిపించటంలేదు కదూ?

శౌర్యుడైన వ్యక్తికి నిజంగా చేరువౌతున్నట్లు ఊహిస్తున్నావా?

స్వప్నికా! ఒక్క క్షణమైనా నీకిలా అనిపించదెందుకు, ఇదంతా మాయ అయివుండవచ్చేమోనని??

(free translation to the poem “Are you the new person drawn towards me?” by Walt Whitman. Dedicated to Maitreyi)

December 18, 2008 at 1:01 pm 7 comments

మేధావి గారూ, ఎవడు లౌకికవాది??

అదేదో సినెమాలో నాయకుడన్నట్లు నిద్దర లేచినప్పటి నుంచి సినిమాల్లోనూ, టీవీల్లోనూ, పత్రికలలోనూ, బ్లాగుల్లోనూ, టీ కొట్టులదగ్గర సాధారణ జనం మాటల్లోనూ ఎక్కడబడితే అక్కడ చర్చనీయాంశం “లౌకికవాదం”. ఇది మేధావులు మాత్రమే చర్చించుకునే విషయం ఏమీ కాదు. లేదా అకాడమియాకూ, ఏ కొంతమంది ప్రొఫెసర్లకూ, రాజకీయనాయకులకూ మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. ఈ రాజకీయ సిద్ధాంతం మీద ప్రతి ఒక్కరికి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. దీనిని సమర్థించేవారూ ఎంత బలంగా సమర్థిస్తారో, విభేదించేవాళ్ళూ అంతే బలం గా అసహ్యించుకుంటారు. మంచో, చెడో జన జీవనాన్ని ఇంతగా ప్రభావితం చేసే రాజకీయ సిద్ధాంతం మరొకటి లేదు అనడం అతియశయోక్తి కాదు. ఆవేశాలనూ, ఉద్వేగాలనూ, వ్యక్తిగత ఇష్టాఇష్టాలనూ పక్కనబెట్టి, దీని గురించి నేను తెలుసుకోవాలని చేసిన ప్రయత్నాలని ఇక్కడ రాసుకుంటున్నాను.


మనం దేనిగురించి నేర్చుకోవాలన్న బళ్ళో చెప్పినట్లు దాని పుట్టుపూర్వోత్తరాలనుంచి రావాలి కదా! అందుకే ముందీ సెక్యులరిజం ఏంటి, ఎవరు దాన్ని మొదటిసారి ప్రయోగించారు లేదా ప్రతిపాదించారు అని చూస్తే..

George Jacob Holyoake అనే బ్రిటిష్ మహాశయుడు “సెక్యులరిజం” అనే పదాన్ని 1846 లో ప్రయోగించాడు. ప్రపంచం మొత్తం ఇంత వాడుకలో ఉన్న ఈ పదానికి సరైన అర్థం/నిర్వచనం ఏంటన్న విషయం మీద ఏకాభిప్రాయం మాత్రం లేదు. పదం యొక్క మూలాల్లోకి వెళితే, లాటిన్ “సెక్యులారిస్” నుంచి వచ్చిన పదానికి లాటిన్లో అర్థం, “ప్రాపంచికం” అని. (worldly rather than unworldly i.e opposite to religion). మన వికిపీడియా చెప్పేదాని Jacob Holyoake మాటల్లోనే: ప్రకారం సెక్యులరిజం అంటే, ప్రభుత్వ విధి విధానాలను ‘మతం’ నుంచి వేరు చేయడం. ప్రభుత్వ విధివిధానాల్లో చర్చి జోక్యాన్ని లేకుండా చెయ్యడం. అంతర్లీనంగా ఇందులో చర్చి (మతం) జోక్యం ఉండటం అనేది సార్వజనీనం అనే assumption కనిపిస్తుంది.
“science as the true guide of man, morality as secular not religious in origin, reason the only authority, freedom of thought and speech and that owing to the uncertainty of survival we should direct our efforts to this life only”.

ఇప్పుడు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏమన్నారో చూద్దాం: When India is said to be a secular state, it does not mean that we reject the reality of the unseen spirit or the relevance of religion to life or that we exalt irreligion. It does not mean that secularism itself becomes a positive religion or that State assumes divine prerogatives. We hold that not one religion should be given preferential status”. ఇప్పుడు అసలు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాశయుని మాటలూ, మన రాధాకృష్ణన్ మాటలూ పోల్చుకుని చూడండి. అసలు మతం యొక్క జోక్యమే లేదు అన్న వ్యతిరేకత నుంచీ, మతం వ్యతిరేకత కాదు, ఏమతానికీ ప్రత్యేక హోదా, గుర్తింపూ లేవు అనేంతగా రూపాంతరం చెందినది సిద్ధాంతం!

సెక్యులర్ రాజ్యం గురించి Donald E Smith తన India as a secular state అనే పుస్తకంలో సెక్యులర్ రాజ్యం గురించి ఇలా అంటాడు: “వ్యక్తిగత మరియు సామూహిక మత స్వేచ్ఛను ఇచ్చేదీ, మతముతో సంబంధము లేకుండా వ్యక్తిని పౌరుడిగా చూసేదీ, రాజ్యాంగపరంగా ఏమతానికి సంబంధములేనిది, ఏమతవిషయంలోను జోక్యం చేసుకోని రాజ్యం సెక్యులర్ రాజ్యము.”

ఇప్పుడు మన రాజ్యాంగం అవతారికను ఒకసారి గుర్తుచేసుకుందాం! (సవరించబడిన తర్వాత)

భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం;

ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;

హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;

వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము;

1950 లో గాని, లేక “లౌకిక” అనే పదాన్ని కలిపిన తర్వాత (1976) గానీ మన రాజ్యాంగంలో “సెక్యులర్” అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. అధికార మతం అన్నది ఏదీ లేకుండా, అన్ని మతాలనూ సమానంగా చూసేదీ, అన్ని మతాలనూ సమానంగా గౌరవించేదీ సెక్యులర్ రాజ్యము. ఇంగ్లాడులో రాణి ప్రొటెస్టెంటు చర్చి కి పెద్ద, అధికారి. కానీ ఇక్కడ చర్చిలాంటి ఒక వ్యవస్థ ఏదీ లేదు. కాబట్టి రాజ్యం అన్ని మతాలపట్లా తటస్థ వైఖరిని, నిస్పాక్షిక దృష్టినీ అవలంభించాలి.

ఇప్పుడు డా|| దుర్గాదాస్ బసు మరియు పి.యం.బక్షి లాంటి మహా న్యాయశాస్త్ర కోవిదులు లౌకికవాదం గురించి వారి పుస్తకాల్లో ఏమంటారో చూద్దాం:

  • సమానత (ఆర్టికల్ 14)
  • మత, కుల ప్రాతిపదికన పక్షపాత ధోరణి లేకుండుట (ఆర్టికల్ 15, 16)
  • భావవ్యక్తికరణ స్వేచ్ఛ (ఆర్టికల్ 19, 21)
  • అధికారమతం అన్నది ఏదీ ఉండకూడదు. రాజ్యము తనదైన మతాన్ని ఏర్పరచనూలేదు, ఉన్న మతాలలో దేనినయినా ప్రత్యేకంగా పరిగణించనూ కూడదు.
  • మతాన్ని గానీ, మత వ్యవస్థను గానీ నిర్వహించడానికి రాజ్యము ఏ పౌరుడినుంచీ శిస్తు వసూలు చేయరాదు.
  • రాజ్యం యొక్క ధనంతో నడిచే ఏ పాఠశాలలోనూ మతాన్ని మతబోధన నిషిధ్ధం.
  • ప్రతి మత సమూహానికీ తమ ధార్మిక సంస్థలు ఏర్పరచుకునే హక్కూ, వాటి వ్యవహారాలను చూసుకునే హక్కూ ఉంటాయి(ధర్మాసనం 26)
  • మైనారిటీ మతం వారికి వారి మతాన్నీ, సంస్కృతినీ పరిరక్షించుకునే హక్కు ఉంటుంది(ఆర్టికల్ 29)

అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ప్రాతిపదిక తీసుకుని నిర్ణయాలు చేస్తే, ఆ రాజ్యము తటస్థ రాజ్యం కాదు, తద్వారా అది లౌకికరాజ్యమూ కాదు.

ఇప్పుడు మన దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు ధర్మాసనం Ayodhya acquisition Act 1993 లో ఇదే సెక్యులర్ అంశం మీద ఏమంటుందో చూద్దాము!

1.దేశవిభజన నేపధ్యంలో లౌకికవాదం ఎనలేను ప్రాధాన్యతను సంతరించుకున్నది(అంటే మనది సెక్యులర్ రాజ్యం అయిఉంటే దేశవిభజన జరిగి ఉండేది కాదని అయ్యవారి భావము). దేశవిభజన జరిగిన తర్వాత కూడా, మొత్తం జనాభాలో 10 శాతం దాకా ఉండే ముస్లిములు భారతీయ పౌరులుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా అన్ని మతాలనూ సమానంగా చూసేటటునటి, ప్రతి పౌరుడుకీ సమాన హక్కులు కల్పించేట్టి ఒక లౌకిక, స్వేచ్చ ప్రసాదించే ఒక లౌకిక విధివిధానము అనివార్యము”(అయ్యవారి మాటలు విన్నారుగా? లౌకికవాద రాజ్యాంగము అంత ముఖ్యమైనదని మన మేధావులంతా అంగీకరించినప్పుడు 1947 లోని రాజ్యాంగపు అవతారికలో ఎందుకు “లౌకిక” భావాలను చేర్చలేదు? అప్పుడంతా ఈ మేధావులు ఏమయ్యరు? స్పష్టంగా చెప్పకపోయినా అది అంతలీనంగా ఉన్న భావన అని కొందరనవచ్చు, అంతర్లీనం గా ఉన్న భావనని కనీసం ఒక్కచోటయినా ఎందుకు నిర్వచించలేదు??)

2. ఇప్పుడు జె.అహ్మది గారు ఏమంటున్నారో విందాం: “సోషలిస్టు మరియు సెక్యులర్ అన్న పదాలను 42వ సవరణ ద్వారా చేర్చినప్పటికీ, సవరణకు ముందే సెక్యులర్ భావనలు మన రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్నాయి. సెక్యులర్ అన్న పదం సరిగ్గా ఇది అని నిర్వచించడానికి వీలులేనిది అవడం వల్ల, ఉద్దేశ్యపూర్వకం గా నిర్వచించకుండా వదిలివేయబడినది. 42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశ్యం అంతర్లీనంగా ఉన్న ఆ భావాన్ని స్పష్టంగా పేర్కొనడం” (అంటే సాక్షాత్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వారి మాటల్లోనే, సెక్యులర్ అనే పదము నిర్వచనాలకు అందనంత సంక్లిష్టమైనదన్నమాట. కొన్ని కోట్లమంది జీవితాలను శాసించే అతి శక్తివంతమైన ఒక సిద్ధాంతానికి, దేన్ని ఆధారంగా చేసుకుని రాజకీయనాయకులు శాసనాలు చేస్తారో, మేధావులు సిద్ధాంతాలు అల్లుతారో అదే పదానికి, అత్యంత పాప్యులర్ పదానికి మన రాజ్యాంగకర్తలకు సరి అయిన నిర్వచనం తెలియదు. అలాంటప్పుడు, ఈ పదం రాజ్యాంగంలో ఏమి చేస్తుంది? దీన్ని ఆధారంగా చేసుకుని శాసనాలు ఎందుకు చెయ్యాలి?)

3. “సెక్యులరిజం అంటే మెజారిటీ వ్యతిరేకత కాదు” – MN వెంకటాచలయ్య-సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జడ్జి

4. అసలు సెక్యులరిజానికి నిర్వచనమే లేదేంటా అని రభస జరుగుతుండటం వల్ల, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజాన్ని నిర్వచించడానికి ప్రయత్నం జరిగింది. MP Jain గారి Indian Constitutional Law నుంచి తీసుకోబడిన ఈ కోట్ చూడండి: “42వ సవరణ ద్వారా రాజ్యాంగ అవతారికలోకి “సెక్యులర్” మరియు “సోషలిస్ట్” అనే పదాలు చేర్చబడ్డాయి కానీ వీటి స్పష్టమైన నిర్వచనాలు దీనిలో చేర్చబడలేదు. CB45 ఈ పదాలకు నిర్వచనాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీని ప్రకారం “సెక్యులర్ రెపబ్లిక్” అనగా సర్వ మతాలకూ సమాన హోదా ఇచ్చే రెపబ్లిక్ అని నిర్వచించబడింది. కానీ ఈ నిర్వచన క్లాజు CA44 లో కనిపించలేదు. దీనికి కారణం: లోక్ సభలో అప్పటి జనతాపార్టీకి భారీ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో వారి సంఖ్య చాలా తక్కువ. CB45 ని లోక్ సభ పూర్తిగా ఆమోదించి పంపినా రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెసీయుల ఓటు వలన కొన్ని ఈ నిర్వచన క్లాజును తీసివేయాల్సి వచ్చింది.” (సూటిగా చెప్పాలంటే, సెక్యులరిజం అనే కీలకమైన పదం యొక్క నిర్వచనాన్ని రాజ్యాంగంలో పొందుపరచడానికి కాంగ్రెసు పూర్తిగా వ్యతిరేకం. ఎందుకని? ఏలినవారికే తెలియాలి!)

మనవాళ్లందరికీ దిగుమతి చేసుకున్న వస్తువులూ, సిద్ధాంతాలంటే విపరీతమైన మోజు. యోగి వేమన గానీ, ఈరో పెద్దయ్య గానీ ఫలానా అన్నారని చెప్పండి, “ఏందో మరీ చాదస్తుడిలా ఉన్నాడు” అనే ఒక నవ్వు పడేసి వెర్రోడి కిందికి జమ కట్టేయగలరు. అదే అబ్రహాం లింకనో, జాను మిల్టనో ఫలానా అన్నరని చెప్పండి, మీరు చెప్పేదాంట్లో సరుకేమీ లేకపోయినా మీరో మేధావి, అభ్యుదయవాది అన్నట్లు చూడబడతారు. కాబట్టి మనం సెక్యులరిజం గురించి ఎంత గొంతు చించుకుని మాట్లాడిన మన మేధావులకెక్కదు… అందుకే ప్రపంచవ్యాప్తం గా ఈ సెక్యులర్ కథా కమామిషూ ఏమిటో చూద్దాం!

అమెరికా: సెక్యులరిజం అనే పదం అసలు అమెరికా రాజ్యాంగంలో కనిపించదు. కానీ, ఇక్కడ చెప్పినట్లు గానే, అంతర్లీనంగా అమెరికా రాజ్యాంగంలో సెక్యులర్ భావాలు ఉన్నాయి. “రాజ్యాంగం సెక్షన్ 3 ప్రకారం: ప్రజాప్రతినిధులూ, సెనేటర్లూ, జుడిషియల్ అధికారులూ పదవీ స్వీకారమప్పుడు, రాజ్యాంగానికి బద్ధుడై చేసిన ప్రమాణమే వర్తిస్తుంది కానీ, మతపరమైన ఏ రకమైన ప్రమాణమూ, ఎలాంటి మతపరమైన అర్హతా వర్తించదు.” (Philadelphia convention, 1789)

ఇప్పుడు దీనిని మనదేశంలో అమలులో ఉన్న “సెక్యులరిజం” ను పోల్చుకుని చూడండి, మనదేశంలో అన్నింటికన్నా మనిషిలో మొట్టమొదట చూడబడేది మతం, కులం. మన గౌరవనీయ కలాం గారు ప్రెసిడెంటవ్వడానికి ఉన్న కారణాల్లో ఆయన ముస్లిం అవ్వడం ఒక కారణం. హిందూత్వ శునకాల ఓటు రాజకీయం అది. అమెరికాలో ఉన్న సెక్యులర్ రాజ్యాంగం ప్రకారం, రాజ్యం యొక్క ఖర్చులతో ఎటువంటి మతపరమైన విద్యాబోధన నిషిద్దం. కానీ మన ఆర్టికల్ 28(3) ప్రకారం, వ్యక్తి గానీ, లేక వ్యక్తి బాగోగులు చూసే వారి యొక్క అనుమతితో, ప్రభుత్వ వ్యయంతో నడిచే మతపరమైన విద్యాబోధనకు అనుమతి ఉంది. ఇది ఏ రకమైన సెక్యులరిజం??

ఇప్పుడు మన కలోనియల్ దొరలు ఇంగ్లాండు వారి గురించి మాట్లాడదాం.ఇంగ్లాండుకు రాతపూర్వకమైన రాజ్యాంగం లేదు. మైనారిటీలు సెక్యులర్ అన్న సమస్యలే లేవు. ఉన్నదంతా Racial Equality Commissions అనే విభాగం, జాతి/మత విభేదాలను పరిష్కరించటానికి. ఇక్కడ అన్ని మతాలకూ సమాన హోదా ఇవ్వబడుతుంది. మతపరమైన విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు.

జర్మన్లు మాత్రము వారి రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని నిర్వచించుకున్నారు. క్లుప్తం గా: ” ప్రభుత్వమూ మరియు మతమూ రెండు వేర్వేరు విషయాలు. మతాలతో సంబంధంలేకుండా రాజ్యం వ్యక్తులతో వర్తించాలి. ప్రతి పౌరుడికీ ఒకే రకమైన విధులు. మెజారిటీలకు గానీ, మైనారిటీలకు గానీ రిజర్వేషనులు లాంటివి నిషిద్ధం. ఇప్పుడు మళ్ళీ మనదేశపు లౌకిక వాదంతో దీనిని సరిపోల్చుకోండి? ఏది సెక్యులరిజం??

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే ఈ టపా నిడివి ఎక్కువ అవ్వడం వల్ల, చదివేవాళ్ళకు బోరుకొడుతుందేమో అని ఆపేస్తున్నా. చివరగా కొన్ని ప్రశ్నలు:

  • రాధాకృష్ణన్ గారు అన్నట్లు: “ఏ మాతానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు” – మరి మన దేశంలో ముస్లిముల హజ్ యాత్రలకీ, క్రైస్తవులు చర్చులు నిర్మించుకోవడానికీ ప్రభుత్వం ఎందుకు ధనాన్ని వెచ్చిస్తున్నట్లు? ఇది పక్షపాతధోరణి కాదా?
  • డోనాల్డ్ స్మిత్ గారి ప్రకారం: సెక్యులర్ రాజ్యాలు ఏదేని ఒక మతాన్ని గానీ, మత సంస్థ వ్యవహారాలలో గానీ జోక్యం చేసుకోకూడదు.అదే తర్కం ప్రకారం మరి భారత ప్రభుత్వం హిందువుల గుళ్ళనూ ఎందుకు నిర్వహించాలి? వాటి వ్యవహారాలు చూసేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు? ఇది మతపరమైన విషయాల్లో జోక్యం కాదా?
  • ఆంధ్రప్రదేశ్ లో హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిం లకు భారీగా గ్రాంటులు ఇవ్వడం తరచూ వింటూంటాం. ఇది ముస్లిం ఓట్లను ఆకర్షించటానికి చేసే గిమ్మిక్కు అని మనకు అందరికీ తెలుసు. మరి ప్రభుత్వం మతాన్ని రాజకీయప్రయోజనాలకోసం వాడుకోవటంలేదా?ఇదేనా సెక్యులరిజం??
  • ప్రకాశ్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాళిదళ్ శిరోమణీ గురుద్వారా కమిటీ ని తన గుప్పిట్లో ఉంచుకునేది. పంజాబ్లో గెలవాలంటే అలా చేయటం కీలకం కాబట్టి. మరి ఇది ప్రభుత్వ వ్యవహారోల్లోనికి మతాన్ని లాగటం కాదా? ఎక్కడుంది సెక్యులరిజం??
  • ఒక్క కర్నాటకలోనే దేవాదాయ శాఖల ఆదాయం 50 కోట్లకు పైమాటే. అందులో పది శాతం మాత్రమే తిరిగి గుళ్ళ బాగోగులపైన ఖర్చుపెడతారు. అసలు దేవాదాయ శాఖలెందుకు? ఆ డబ్బుపై సెక్యులర్ ప్రభుత్వానికి ఏరకమైన అధికారం ఉంది? మరి మసీదులలోనూ, చర్చులలోనూ పోగయ్యే డబ్బు ఎక్కడికెల్తీంది? ఎవరు పక్షపాతి? ఎవరు సెక్యులర్?

మేధావిగారూ? ఎవడు సెక్యులర్?? కాస్త చెబుదురూ!!

References and further readings:

http://books.google.co.in/books?hl=en&lr=&id=hJqfIR6UnWgC&oi=fnd&pg=PP11&dq=secularism&ots=_06wghCQuO&sig=HC54gToFpBa_iUD0qxwfbtIRxhA#PPA19,M1

http://www.edwardjayne.com/secular/biblio.html

http://atheism.about.com/od/secularismseparation/a/HolyoakeSecular.htm

http://books.google.co.in/books?id=Ifds1hI-W9QC&pg=PA224&lpg=PA224&dq=radhakrishnan+on+secularism&source=web&ots=PEa4Yb34zU&sig=7goJAdNYdfOeU4E-NPsBmzm9Wto&hl=en&sa=X&oi=book_result&resnum=8&ct=result#PPA225,M1

http://books.google.co.in/books?id=xNAI9F8IBOgC&pg=PA47&lpg=PA47&dq=Donald+E.+Smith+india+as+secular&source=web&ots=IDdfrBwIg4&sig=SKi1q3lBN3-agFnynE1aHDBgBQs&hl=en&sa=X&oi=book_result&resnum=8&ct=result#PPA46,M1

http://philosophy.lander.edu/logic/circular.html

http://www.probertencyclopaedia.com/cgi-bin/res.pl?keyword=Suppressio+Veri+Suggestio+Falsi&offset=0

http://www.allacademic.com/meta/p_mla_apa_research_citation/0/4/2/2/5/p42250_index.html


December 12, 2008 at 2:34 pm 16 comments

మేధావులని తరిమికొట్టండి!!

ఒక్కసారి క్రింది విషయం చదవండి:

i am really impressed by the indian agencies that after the attack they suddenly woke up and within 24 hrs they find a link till multan wowww.its wake up time for them .i am thinking if pakistan would have not be indian neigbour than where indians agencies can throw there incompetency. and they find a stupid boat aswell when i saw the picture really i cant control my laugh ,indians sea are so vulnerable that any one can sail throw them with ammo and weapons.what a security that one fine morning suddenly mumbie become a battle ground and army is fighting hard to take over,its 3 days and still they cannot overcome the wizerd type pakistani isi backed terrorist,really this is a slap on the indian army and law agencies, its just appears to me that like there third class copying of hoolywood filmz they tried to copy 9/11 but like there filmz they miserablly failed

.

ఇంకా ఇది:

lets see what’s been happening in the background of all this

1. Indian army’s involvemnt in Blasts in Malegaon and Sanjhota express and more at verge of getting revealed
2. the two highest ranking antiterrorism officers who were investigating the HOLY! COLONEL from Indian army also killed in Mumbai attacks
3. Pakistani army being sqeezed by american and Indian agents like Baitullah from the western front, why to leave the eastern theatre unattended,

but what will be the pretext!!!!!



చివరగా ఇది:

But . . . . . its looks like an huge propaganda against Pakistan.
These attcks could ba an join opration by Afghanistan, India & USA
just build more and more pressure on Pakistan.
What about those many many attcks in Pakistan
What about those many thousands, those lost their lives in these
attcks in Pakistan since Pakistan supportin againt WAR ON TERROR
Attacks in Mumbai and all European and others media are now busy to showing all



ఇవి చదివిన తర్వాత మీకెవరికైనా ఇవి ఎక్కడైనా విన్నట్లు అనిపిస్తోందా? నాకు అనిపించింది. కాని పాకిస్తానీ మీడియా నుంచి కాదు. ఇక్కడే. మనమధ్యే! ఇవే మాటలు కాకపోయినా ఇంచుమించు ఇవే భావాలు. ఇలా పాకిస్తాన్ పౌరులు మాట్లాడటం వింతగా అనిపించదు. పైపెచ్చుముచ్చటేస్తుంది. ఎంతయినా వారిదేశం. వారికీ దేశ భక్తి ఉంటుంది. ఇంచుమించు ఇలాంటి మాటలే మన మేధావులు మాట్లాడితే? ఇదంతాసహజమే, ఆటలో భాగమే, మనవాళ్ళుతక్కువతినలేదు అని తర్కిస్తే?

సరే…. ఉగ్రవాదం, మతం, రాజనీతి చాలా సంక్లిష్టమైన విషయాలు. మనం ఓకటని తేల్చి పడెయ్యలేం! మరి అలాంటప్పుడు “అంతా మాయ” అనే మెట్టవేదాంతం టైపులో “ఇక్కడెవ్వరూ పతివ్రతలు కారు. అంతా రిలేటివ్”, “మనకు లాభం ఉండే పనులు మనం చేస్తాం, అట్లే పాకిస్తానీయులకు లాభం ఉండే పనులు వాళ్ళు చేస్తారు” లాంటి వివరణలని ఎలా అర్థం చేసుకోవాలి?ఏరకమైన సమస్యని ఈ వివరణలు పరిష్కరిస్తాయి, ఏ రకమైన అంశాన్ని తెలియజెప్పడానికి ఉపయోగపడతాయి?? నాకైతే వినేవాళ్ళ తర్కాన్ని ఎద్దేవా చేసినట్లనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. ఈరకమైన వివరణలకంటే, నేను పైన ఉటంకించిన వివరణలే అర్థవంతం అనిపిస్తాయి. మేధావి రంగుపూసుకోని సాధారణ దేశప్రజలు చేసిన వ్యాఖ్యలవి . కనీసం వారికి పాకిస్తానుని కించపరిచి మాట్లాడి తమ “అభ్యుదయ” కుతి తీర్చుకోవాలని లేదు.

మన దేశపు మేధావులకు(లేదా మేధావులమని భ్రమపడుతున్న వారికి) సొంతంగా అలోచించే తెలివితేటలు ఎప్పుడువస్తాయో?!
Links: http://forumpakistan.com/mumbai-bomb-attacks-t18755-2.html

http://forumpakistan.com/mumbai-bomb-attacks-t18755.html

http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_08.html


December 10, 2008 at 5:24 pm 27 comments

వెలుతురుబాకు తాకిడికి….

నా అతి తెలివిని భరించలేకనుకుంటా ఒక పెద్దాయన నన్ను 7 తరగతి తర్వాత వేంటనే 10 తరగతి కి దూకెయ్యమని సలహా ఇచ్చాడు, బడిలో ఉండగా. నాకు కూడా సలహా బాగా నచ్చి 7 తరగతి తర్వాత నేరుగా 10 లో చేరిపోయాను. తరగతిలో ఉన్నా మనం పాఠ్యపుస్తకాలనుంచీ, అందులోని అంశాలనుంచీ పెద్దగా నేర్చుకున్నదీ అందులోనివి నిజ జీవితంలో పనికొచ్చినవీ ఏమీ లేవు. కానీ విషయం ఎందుకు గుర్తొస్తుందంటే, 8 లేదా 9 తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఒక అద్భుతమైన పద్యాన్ని నేను యాధృచ్చికంగా ఒకసారి చదవడం జరిగింది. పాఠం పేరు, “వివేకానందుని పునరాగమనం“. మొదలుపెట్టిన తర్వాత ఎందుకో పాఠం మొత్తం చదివాను(మామూలుగా పాఠ్యపుస్తకాలు చదవడం అలవాటులేని పని). రచయిత ఎవరో, పద్యాలు ఎక్కడినుంచి సంగ్రహించారో గుర్తులేదు.

కొన్ని కొన్ని విషయాలు సూటిగా గుండెకు తగులుతాయి. విషయాన్ని మెదడు విశ్లేషించే లోగానే, అవి మనిషిమీద చెరగని ముద్ర వేస్తాయి. సరిగా అలాంటి అనుభూతే అందులోని ఒక పద్యం (నిజానికి పూర్తి పద్యం కూడా సరిగ్గా గుర్తులేదు, అసంపూర్ణం గా గుర్తు) ఇప్పటికీ నాకు కలుగజేస్తుంది.

వెలుతురు బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి
గుండెలు ఝిలుఝిల్లున రుధిర నిర్ఝరి పారె
దిగంగనా ముఖమ్ముల నవకుంకుమ ప్రభలు దెండు,
రండు, మేల్కొండు…..

తర్వాత ఇహ గుర్తుకులేదు. కానీ గుర్తున్న మూడు పాదాలూ మనిషి గా నన్నెంత ప్రభావితం చేశాయో మాటల్లో చెప్పలేను. “వెలుతురుబాకు…” ఎంత అద్భుతమైన భావన? ఎక్కడ దొరుకుతుందీ వెలుతురు బాకు?! ఒక్క దెబ్బతో అజ్ఞాన చీకటిని తుత్తునియలు చేసే కాంతి ఖడ్గం!! ఇలా అనిపించేది అప్పట్లో. పాఠం పేరువివేకానందుని పునరాగమనంఅని గుర్తుకు ఉండటం, వివేకానందుడేవరు అని ఆయన పుస్తకాలు కొనుక్కొని చదవడం, అంతకుముందు నేను జీవిస్తున్న నా ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.

ఉపనిషత్తుల లోనో లేక గీత లోనో వెలుతురు బాకులాంటి ప్రయోగం ఉంది. “జ్ఞానఖడ్గంతో అజ్ఞానాన్ని ఛేదించు…” అని.

ఇది రాసుకోవడం నాకోసమే అయినప్పటికీ, ఎవరన్నా టపాను చదవడం జరిగితే, దయచేసి పద్యాన్ని రాసింది ఎవరు? పుస్తకంలోనివి, ఎక్కడ దొరుకుతుంది లాంటి విషయాలు తెలుపగలరు. గుఱ్ఱం జాషువా గారు రాసి ఉంటారేమో అని ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు పాతపుస్తకాల షాపుల్లో కనిపించిన జాషువా గారి పుస్తకాలన్నీ కొన్నాను. కానీ నేను కొన్నవాటిల్లో లేదు!

************

Update: పైన పేర్కొన్న పద్య రచయిత, దాశరధి – మాహాంద్రోదయం లోనిదీ పద్యం. పద్యమూ దాని తాత్పర్యమూ క్రింద, భైరవభట్ల గారి మాటల్లో-

వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!

“వెలుతురనే బాకుతో చిక్కని చీకటి రాత్రి గుండెలని చీల్చితే, అందులోంచి పారిన రక్తపుటేరు లాగా ఉందిట ఉదయాకాశం. ఆకాశంలో దిక్కులనే కాంతల ముఖాలమీద కుంకుమ కాంతులు విరిసాయట. కింద నేలపై అదే సమయానికి తామర మొగ్గలుకూడా విచ్చుకుంటాయి కదా. పైన ఆ కుంకుమ ప్రభలు కూడా, కిందనున్న తామర మొగ్గల్లానే ఉన్నాయిట! ఇంకేముంది తెల్లవారింది, తలుపులు తెరవండి, రండి, ఇంకా పడుకొని ఉన్నవాళ్ళందరినీ నిద్రలేపండి అని కవి పిలుపు”
(Thanks to Bhaivabhatla)

http://telugupadyam.blogspot.com/2008/12/blog-post.html

December 7, 2008 at 3:19 pm 9 comments

You can’t handle the truth

A scene from the movie “A few good men” comes to my mind. A great scene from a great movie!!

Here is the transcript:

JESSEP: You want answers?

KAFFEE: I think I’m entitled to them.

JESSEP: You want answers?!

KAFFEE: I want the truth.

JESSEP: You can’t handle the truth!

JESSEP: (continuing)Son, we live in a world that has walls. And those walls have to be guarded by men with guns. Who’s gonna do it? You? You, Lt. Weinberg? I have a greater responsibility than you can possibly fathom. You weep for Santiago and you curse the marines. You have that luxury. You have the luxury of not knowing what I know: That Santiago’s death, while tragic,probably saved lives. And my existence, while grotesque and incomprehensible to you, saves lives.

You don’t want the truth. Because deep down, in places you don’t talk about at
parties
, you want me on that wall. You want me there

We use words like honor, code,loyalty…we use these words as the backbone to a life spent defending something. You use ’em as a punchline.

I have neither the time nor the inclination to explain myself to a man who rises and sleeps under the blanket of the very freedom I provide, then questions the manner in which I provide it. I’d prefer you just said thank you and went on your way. Otherwise, I suggest you pick up a weapon and stand a post. Either way, I don’t give a damn what you think you’re entitled to.

December 4, 2008 at 9:27 pm 14 comments

Older Posts



Design a site like this with WordPress.com
Get started